Viral Video: వామ్మో.. ఈ బాలిక గుండె ధైర్యమేందిరా సామీ.. ప్రమాదకర పాముతో ఆటలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Snake  Video: పాము పేరు వినగానే చాలా మందికి భయమేస్తుంది. ఇక పొరపాటున అది ఎదురుపడితే క్షణం కూడా ఆ దరిదాపుల్లో ఉండరు. ఎందుకంటే కొన్ని పాములు కాటేస్తే ప్రాణాలు అట్టే గాలిలో కలిసిపోతాయి.

Viral Video: వామ్మో.. ఈ బాలిక గుండె ధైర్యమేందిరా సామీ.. ప్రమాదకర పాముతో ఆటలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Girl With Snake
Follow us
Basha Shek

|

Updated on: Sep 01, 2022 | 1:12 PM

Snake  Video: పాము పేరు వినగానే చాలా మందికి భయమేస్తుంది. ఇక పొరపాటున అది ఎదురుపడితే క్షణం కూడా ఆ దరిదాపుల్లో ఉండరు. ఎందుకంటే కొన్ని పాములు కాటేస్తే ప్రాణాలు అట్టే గాలిలో కలిసిపోతాయి. అయితే ఈరోజుల్లో కొందరు పెద్ద పెద్ద పాములతో సైతం ఆటలాడుకుంటున్నారు. పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా పాములను పట్టుకుంటూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అందులో కొన్ని వీడియోలు ఎంతో భయానకంగా ఉంటున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. దీనిని చూస్తే ఎవరికైనా గుండెల్లో గుబులు పుట్టాల్సిందే. ఈ వీడియోలో ఒక అమ్మాయి ఒక పెద్ద నల్లటి పామును పట్టుకుని బొమ్మలా ఆటలాడుకోవడం మనం చూడవచ్చు. ఆ అమ్మాయి వయసు చిన్నదైనా, పాము మాత్రం చాలా పెద్దగా, భయంకరంగా ఉంది. అయితే ఆ అమ్మాయి ముఖంలో ఎలాంటి భయం లేదు. పైగా ఆ పెద్ద పాము పాప నుంచి దూరంగా పోతున్నా మళ్లీ తన వైపుకు లాగుతుంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేక్‌మాస్టెరెక్సోటిక్స్ అనే ఖాతాతో ఈ వైరల్‌ వీడియోను షేర్‌ చేశారు. ఇది నెటిజన్లను తెగ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోకి వేల కొలదీ లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి. పామును బొమ్మలాగా భావించి ఆడిన బాలిక గుండె ధైర్యాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు. అది ఆ అమ్మాయి పెట్ స్నేక్‌ అనుకుంటా అని మరికొందరు రాసుకొచ్చారు. ఇదే సమయంలో మరికొందరు బాలిక తల్లిదండ్రులను చీవాట్లు పెడుతూ నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. బొమ్మలతో ఆడుకోవాల్సిన పిల్లలను ఇలా పెంచుతున్నారేంటి? లైకులు, కామెంట్ల కోసం పిల్లల జీవితాలను పణంగా పెట్టవద్దంటూ సూచిస్తున్నారు. పాములు విషపూరితం కానప్పటికీ పిల్లలను వాటికి దూరంగా ఉంచాలంటూ హితబోధ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదే..

View this post on Instagram

A post shared by Ariana (@snakemasterexotics)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..