Telugu News Trending Young woman injurded while she catches jackfruit video was gone viral in social media au79
Video Viral: పననపండును పట్టుకోవాలనుకుంది.. ఊహించని ప్రమాదానికి విలవిల్లాడింది.. షాకింగ్ వీడియో
పనసపండు పేరు వింటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. పే..ద్ద కాయను ఒలుచుకుని, తొనలను కట్ చేసుకుని తింటుంటే ఆ హాయే వేరు. ఘాటైన వాసన, తియ్యటి రుచితో ఉండే వీటిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే పనసకాయలు ఎక్కడపడితే..
పనసపండు పేరు వింటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. పే..ద్ద కాయను ఒలుచుకుని, తొనలను కట్ చేసుకుని తింటుంటే ఆ హాయే వేరు. ఘాటైన వాసన, తియ్యటి రుచితో ఉండే వీటిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే పనసకాయలు ఎక్కడపడితే అక్కడ పండవు. కొన్ని నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే సాగవుతాయి. అయితే కొంత మంది మాత్రం వీటిని పెరట్లో పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. పెరటి తోట పెంపకం మంచి వ్యాపకమే అయినప్పటికీ కొన్ని సార్లు అది మనకు చిరాకు తెప్పిస్తుంది. సాధారణంగా పనస పండ్ల చెట్లు పెద్దగా ఉంటాయి. కాయలు బరువుగా ఉండటంతో కాండంపై, కొమ్మలపై కాస్తాయి. వీటిని కోసేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. పొలాలు, తోటల్లో ఉండటం సరదాగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ అది కొన్ని సార్లు ప్రమాదాన్నీ కలిగిస్తాయనే విషయాన్ని మీరెప్పుడైనా గమనించారా.. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి చెట్టు ఎక్కి పనస పండ్లు కోస్తుండగా కింద ఉన్న ఇద్దరు యువతులు క్లాత్ సహాయంతో పనస కాయలను ప్రయత్నిస్తుంటారు. వారు జాగ్రత్తగా పనసకాయలను పట్టుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. అదుపు తప్పి ఓ యువతి తలపై బలంగా పడుతుంది. దీంతో ఆమె తీవ్ర నొప్పితో క్లాత్ ను అక్కడే వదిలేసి పక్కకు వెళ్లిపోతుంది.
ఆమె తలకు పనస పండు చాలా బలంగా తగిలినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ‘psycho_biihari’ అనే యూజర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు దీనికి 26,000 వ్యూస్, 1,700 లైక్‌లు వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. నవ్వించే ఎమోజీలతో కామెంట్‌లు చేస్తున్నారు.