Crime: పురిటినొప్పులతో బాధ పడుతున్న భార్యను తోపుడు బండిపై తోసుకెళ్లాడు.. తీరా అక్కడికెళ్లాక షాక్..

భారతదేశం శాస్త్రసాంకేతిక రంగాల్లో శరవేగంగా దూసుకుపోతుందన్న మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాలకు వైద్య సదుపాయాలు అందుబాటులో...

Crime: పురిటినొప్పులతో బాధ పడుతున్న భార్యను తోపుడు బండిపై తోసుకెళ్లాడు.. తీరా అక్కడికెళ్లాక షాక్..
Husband Carried Wife
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 01, 2022 | 8:47 AM

భారతదేశం శాస్త్రసాంకేతిక రంగాల్లో శరవేగంగా దూసుకుపోతుందన్న మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాలకు వైద్య సదుపాయాలు అందుబాటులో రాలేదు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు సరైన వైద్య సౌకర్యాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది ఆలసత్యం అమాయకుల ప్రాణాలు తీసేస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటన ఇలాంటి సమాధానమే ఇస్తోంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను కాపాడుకునేందుకు ఆ భర్త చేసిన ప్రయత్నం కంటతడి పెట్టించింది. అంబులెన్స్ రాకపోవడంతో చేసేదేమీ లేక తోపుడుబండిపై తోసకెళ్లాడు. అక్కడికి వెళ్లాక కూడా అతనికి నిరాశే ఎదురైంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దామోహ్‌ జిల్లాలోని రానేహ్ ప్రాంతానికి చెందిన కైలాష్ అహిర్వార్‌, తన భార్య కాజల్ తో కలిసి నివాసముండేవాడు. కాజల్ నిండు గర్భిణీ. నెలలు నిండటంతో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెకు చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించుకున్నాడు. ఇందు కోసం అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అంబులెన్స్ సిబ్బంది నుంచి స్పందన రావలేదు. ఓ వైపు భార్యకు పురిటి నొప్పులు, మరోవైపు అంబులెన్స్ లేకపోవడంతో గత్యంతరం లేక తోపుడుబండిపై కాజల్ ను పడుకోబెట్టాడు. బండిని తోసుకుంటూ కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు.

అయితే.. అక్కడికి వెళ్లాక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు, నర్స్​అందుబాటులో లేరు. దీంతో షాక్ అయిన కైలాష్ ఏం చేయాలా అని దిక్కు తోచిని స్థితిలో ఉండగా.. అతని పరిస్థితిని గమనించిన స్థానికులు మరొక సారి అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ రావడంతో ఆలస్యం చేయకుండా వెంటనే హాటా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని రిఫర్‌ చేశారు. చివరకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధికారుల వద్దకు వీడియో చేరడంతో వారు తీవ్రంగా స్పందించారు. జిల్లా మెడికల్​ఆఫీసర్​ఆర్​పీ కోరి సమగ్ర విచారణ చేపడతామని వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి