AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAP vs BJP: ఢిల్లీలో బీజేపీ ఆప్‌ ఢీ అంటే ఢీ.. మాటల యుద్ధం కాస్తా వీధిపోరాటాలుగా మారిన వైనం..

AAP vs BJP: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ ఆప్‌ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మాటల యుద్ధం మాత్రమే కాదు వీధి పోరాటాలకు కూడా దిగుతున్నారు ఇరుపార్టీల నేతలు.

AAP vs BJP: ఢిల్లీలో బీజేపీ ఆప్‌ ఢీ అంటే ఢీ.. మాటల యుద్ధం కాస్తా వీధిపోరాటాలుగా మారిన వైనం..
Bjp Vs Aap
Shiva Prajapati
|

Updated on: Aug 31, 2022 | 10:11 PM

Share

AAP vs BJP: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ ఆప్‌ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మాటల యుద్ధం మాత్రమే కాదు వీధి పోరాటాలకు కూడా దిగుతున్నారు ఇరుపార్టీల నేతలు. ఢిల్లీలో స్కూళ్ల నిర్మాణంలో అవినీతి జరుగుతోందని బీజేపీ ఆరోపించింది. ఈ విషయంపై బీజేపీ నేత గౌరవ్‌ భాటియా, ఆప్‌ ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ మధ్య సవాళ్ల పర్వం నడిచింది. తాము నిర్మించిన ప్రభుత్వ స్కూళ్లకు వచ్చి చూడాలని, అవినీతిని నిరూపించాలని సౌరభ్‌ భరద్వాజ్‌ సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌కు స్పందించిన గౌరవ్‌ భాటియా ప్రభుత్వ స్కూల్‌ను సందర్శించడానికి వచ్చినప్పుడు గొడవ జరిగింది.

1960లో నిర్మించిన స్కూల్‌ను చూపించి తాము నిర్మించినట్టు కేజ్రీవాల్‌ ప్రచారం చేసుకుంటున్నారని గౌరవ్‌ భాటియా విమర్శించారు. స్కూల్‌ కొత్త బ్లాక్‌ లోకి వచ్చి చూస్తే అసలు విషయం తెలుస్తుందని గౌరవ్‌ భరద్వాజ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అయితే స్కూల్‌ లోపలికి రాకుండానే గౌరవ్‌ భాటియా వెనక్కి వెళ్లిపోయారు. కారు నుంచి దిగకుండానే భాటియా పారిపోయారని ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ విమర్శించారు. దీంతో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. గౌరవ్‌భాటియా కారు వైపు ఆప్‌ కార్యకర్తలు దూసుకొచ్చారు. ఢిల్లీలో 500 స్కూళ్లను నిర్మించినట్టు ఆప్‌ ప్రచారం చేసుకుంటుందన్నారు గౌరవ్‌ భాటియా. కొత్త స్కూళ్ల పేరుతో అవినీతి పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే తాము కట్టిన స్కూళ్లను చూడడానికి గౌరవ్‌ భాటియా ఇష్టపడడం లేదని , అందుకే పారిపోయారని ఆప్‌ కౌంటరిచ్చింది.

ఆపరేషన్‌ లోటస్‌పై దర్యాప్తునకు డిమాండ్‌..

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో ఆప్‌ ఎమ్మెల్యేలు సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఆపరేషన్‌ లోటస్‌పై వెంటనే దర్యాప్తు చేయాలని ఆప్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు ఇచ్చి కొనేందుకు ప్రయత్నించిందని ఆప్‌ నేతలు ఆరోపించారు. తమ వినతి పత్రాన్ని తీసుకోవడానికి సీబీఐ డైరెక్టర్‌ ముందుకు రాలేదన్నారు ఆప్‌ ఎమ్మెల్యే ఆతిషి. ఆప్‌ ఎమ్మెల్యేల నిరసన తరువాత సీబీఐ అధికారులు బయటకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు.

మరోవైపు నోట్లరద్దు సందర్భంగా జరిగిన స్కాంలో తన ప్రమేయముందని ఆప్‌ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా వేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా నిర్ణయించారు. ఆప్‌ ఎమ్మెల్యేలు సౌరభ్‌ భరద్వాజ్‌, ఆతిషితో సహా మరో ఇద్దరిపై పరువునష్టం దావా వేయాలని ఎల్‌జీ నిర్ణయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ కేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్