Viral Video: ‘నన్ను పెళ్లి చేసుకో’.. వ్యక్తి వెంట పడిన యువతి.. మ్యాటర్ తెలిస్తే మీటర్ లేచిపోద్ది..!
Viral Video: బిహార్‌లోని నవాడాలో వింత ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతి.. వ్యక్తి వెంట పరుగులు తీసింది.
Viral Video: బిహార్‌లోని నవాడాలో వింత ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతి.. వ్యక్తి వెంట పరుగులు తీసింది. యువతి మాత్రమే కాదు.. ఆమె కుటుంబ సభ్యులు కూడా పరుగులు తీశారు. అయితే వారి నుంచి తప్పించుకునేందుకు వ్యక్తి తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నవాడాలోని భగత్ సింగ్ చౌక్ వద్ద ఓ యువతి.. వ్యక్తి వెంట పెరుగులు తీస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ అతన్ని అభ్యర్థిస్తూ పరుగెత్తింది. దాంతో చుట్టూ ఉన్నవారికి ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ అయ్యారు. యువతి వెంట ఆమె తల్లిదండ్రులు సైతం ఉండటంతో.. ఏం జరుగుతుందో అర్థంకాక అందరూ పరెషాన్ అయ్యారు.
అయితే, పరుగులు తీసిన యువతికి, ఆ వ్యక్తికి మూడు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. అతనికి బైక్‌తో పాటు రూ. 50 వేల నగదును కూడా కట్నంగా ఇచ్చారు. అయితే, పెళ్లి తేదీ సమీపించగా రీషెడ్యూల్ చేయాలని కోరాడు. వివాహాన్ని ఆలస్యం చేయడానికి, వరుడు, వరుడి కుటుంబ సభ్యులు నిత్యం ఏవో సాకులు చెబుతూ తప్పించుకుని తిరుగుతున్నారు.
అయితే, తాజాగా యువతి, ఆమె కుటుంబ సభ్యులు మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ కాబోయే వరుడిని గుర్తించిన యువతి.. తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వెంటనే అతని వద్దకు వెళ్లగా.. అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అతను పరుగులు తీయగా.. అతని వెంట యువతి, ఆమె తల్లిదండ్రులు పరుగులు తీశారు. ఇంతలో అక్కడ ఉన్న స్థానికులు ఏం జరుగుతుందో అర్థం కాక, యువకుడిని పట్టుకున్నారు. చాలా మంది గుమిగూడారు. ఆ యువతి నన్ను పెళ్లి చేసుకో అంటూ అతన్ని పట్టుకుని కోరింది. అతను మాత్రం వారిని విడిపించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇంతలో విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. యువతి, ఆమె తల్లిదండ్రులను, యువకుడి, అతని తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరకు ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించడంతో కథ సుఖాంతం అయ్యింది. అయితే, ఈ ఉరుకులు, పరుగులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
एक शादी ऐसा भी
जब शादी करने से भाग रहा था लड़का, तब लड़की ने उसे खुद पकड़कर रचाई शादी
मामला #बिहार के #नवादा का है। लड़की ने कहा कि पैसा और बाइक लेकर शादी करने से भाग रहा था लड़का#ExclusivePost#xclusivepost pic.twitter.com/LSpch8Sp5a
— Exclusive Post (@xclusivepost) August 28, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..