TSRTC: టీఎస్ఆర్టీసీ ఆహ్వానం.. అందరూ అర్హులే.. సెప్టెంబర్ 5 వరకే అవకాశం..!
TSTRC: మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? లేక వ్యాపారం చేయాలని భావిస్తున్నారా? అదీకాక ఉద్యోగంతో విసిగిపోయి వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?..
TSTRC: మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? లేక వ్యాపారం చేయాలని భావిస్తున్నారా? అదీకాక ఉద్యోగంతో విసిగిపోయి వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే టీఎస్ఆర్టీసీ ఓ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌ను అందిపుచ్చుకుని వ్యాపారం ప్రారంభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ ఆహ్వానం ఏంటో తెలుసుకుందాం. తెలంగాణ అతిపెద్ద బస్‌స్టాండ్ ఏది? అంటే టక్కున మహాత్మాగాంధీ బస్ స్టాండ్ అని చెప్తాం. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా.. ఎంజీబీఎస్ నుంచి బస్సు సదుపాయం ఉంటుంది. ఇక్కడ ప్రయాణికుల రద్దీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే, బస్టాండ్‌లో దుకాణాలు చాలా ఉంటాయి. కిరాణా దుకాణాలు, క్యాంటీన్ వగైరా ఉంటాయి. బస్టాండ్‌లో ఉన్న ఈ దుకాణాలకు టీఎస్ఆర్టీసీ వేలం వేస్తోంది. అర్హత, ఆసక్తి కలిగిన వారు.. ఈ వేలంలో పాల్గొనవచ్చునని పేర్కొంది. ఖాళీగా ఉన్న స్టాల్స్, వాటి విస్తీర్ణం, ధర వంటి వివరాలను వెల్లడిస్తూ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు సెప్టెంబర్ 5 సాయంత్రం 4 గంటల లోపు టెండర్ వేసుకోవచ్చునని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు కింద ట్వీట్‌లో వివరింగా చూసుకోవచ్చు.
నగరం నడబొడ్డున, రాష్ట్రంలోని ప్రజలందరూ మీకు వినియోగదారులే అయితే ! వ్యాపారం చేసేందుకు ఇంతకంటే అనువైన స్థలం ఉంటుందా? ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొండి..#TSRTCStallTenders pic.twitter.com/yrXPSvvhKW
ఇవి కూడా చదవండి— Managing Director – TSRTC (@tsrtcmdoffice) August 29, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..