Telangana: మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థులు
మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో భోజన తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 25 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచారణ చేపట్టారు.

మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో భోజన తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 25 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచారణ చేపట్టారు.
గురువారం (ఫిబ్రవరి 19) రాత్రి తిన్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్పస్థతకు గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. రోజులాగే రాత్రి పూట భోజనం చేసిన విద్యార్థినిలు తెల్లవారు జామున నుండి వరుసగా వాంతులు, విరేచనాలు చేసుకోవడాన్ని పాఠశాల సిబ్బంది గుర్తించారు. వీరితోపాటు ఎస్ఎస్‌సీ ఇంటర్నల్ మార్క్స్ వెరిఫికేషన్ టీంలో నలుగురు ఉపాధ్యాయులు ఈ అస్వస్థత బారిన పడ్డారు.
అస్వస్థతకు గురైన హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు విద్యార్థినులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో పది మంది విద్యార్థినిలకు చికిత్స అందించగా ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థినిలు వాంతులు చేసుకున్నారని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని విద్యార్థినులను విచారించారు. తమకు ఎలాంటి భయాలు వద్దని, పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థినిలకు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.
అస్పస్థతకు గురైన విద్యార్థులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి కస్తూర్బా గాంధీ పాఠశాలకు తరలించారు. పాఠశాలలోనే హెల్త్ క్యాంప్ ఏర్పాటుచేసి చికిత్స అందిస్తామన్నారు. విద్యార్థినీల తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రిన్సిపాల్ అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
