Telangana: ఇబ్రహీంపట్నం ఘటనపై కేసీఆర్ సర్కార్ సీరియస్.. ఇద్దరు మహిళల మృతిపై విచారణకు ఆదేశం..

శస్త్రచికిత్స అనంతరం నలుగురు మహిళలు అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వీరిలో మమత, సుష్మ అనే ఇద్దరు మహిళలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Telangana: ఇబ్రహీంపట్నం ఘటనపై కేసీఆర్ సర్కార్ సీరియస్.. ఇద్దరు మహిళల మృతిపై విచారణకు ఆదేశం..
Family Planning Operation F
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 29, 2022 | 9:02 PM

Telangana Government: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం (ibrahimpatnam) లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ విఫలమై.. ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు మహిళలు మరణించారని వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనలపై విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు 34 మంది మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స అనంతరం నలుగురు మహిళలు అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వీరిలో మమత, సుష్మ అనే ఇద్దరు మహిళలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో సుష్మ కుటుంబ సభ్యులు ఆమె మృతదేహంతో సోమవారం ఉదయం సాగర్‌ రహదారిపై ధర్నా నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

దీనిపై వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇద్దరు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించింది. వారి పిల్లలకు గురుకులాల్లో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించినట్టు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు ప్రకటనలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..