AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగమహారాజులకు వరం ఈ పండు.. డైలీ తిన్నారంటే ఆ విషయంలో తిరుగుండదు..

కర్బూజా పండులో పొటాషియం అధికంగా ఉంటుంది.. ఇది రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరచి, కిడ్నీలో రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి - విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటం వల్ల చర్మాన్ని కాంతివంతంగా మార్చి, కంటి చూపును మెరుగుపరుస్తుంది.

మగమహారాజులకు వరం ఈ పండు.. డైలీ తిన్నారంటే ఆ విషయంలో తిరుగుండదు..
Muskmelon Benefits
Shaik Madar Saheb
|

Updated on: Feb 21, 2026 | 10:06 AM

Share

కర్బూజ (Muskmelon) లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. కర్జూజ వేసవిలో చాలా మేలు చేస్తుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది.. మస్క్‌మిలన్ లో నీరు పుష్కలంగా ఉండటంతోపాటు.. విటమిన్ A, C, పొటాషియం కలిగి ఉంటుంది. వాస్తవానికి కర్బూజా పండు అనేది కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన ఒక అద్భుతమైన పండు.. దీనిని మస్క్ మిలన్ అని పిలుస్తారు. దీనిలోని పోషకాలు పలు సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి. కర్బూజా పండు వేసవిలో శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, కేలరీలు లేని తీపిదనాన్ని అందిస్తుంది. దీని లేత నారింజ రంగు గుజ్జు రుచికరంగా ఉంటుంది. కర్బూజా గింజలను కూడా ఎండబెట్టి, వలుచుకొని తింటారు. ఈ పండు జ్యూస్ చాలా ప్రసిద్ధి చెందింది.. ఇది ఒంటికి చలువ చేసి, శరీరంలోని వేడిని బయటకు పంపుతుంది. వేడితో బాధపడేవారు ఈ సీజన్‌లో కర్బూజా రసం తాగడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఆయుర్వేదంలో కూడా ఈ రసాన్ని ఆకలి మందగించడం, బరువు తగ్గడం, మలబద్ధకం, మూత్రనాళ సమస్యలు, అసిడిటీ, అల్సర్ వంటి సమస్యల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తారు.

కర్బూజా (kharbuja) పండు తక్షణ శక్తిని అందిస్తుంది. అలసటగా అనిపించినప్పుడు, ఒక గ్లాసు కర్బూజా పండు రసం తాగడం వల్ల వెంటనే శక్తి వస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.. పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

పొటాషియం అధికంగా ఉండటం వల్ల కర్బూజా పండు రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ సీజన్‌లో కర్బూజా పండును తినడం లేదా రసం తాగడం వల్ల కిడ్నీలో రాళ్లను కరిగించి, మూత్రపు సంచిలోని రాళ్లను తొలగిస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరచి, మూత్రం సాఫీగా వచ్చేలా చేస్తుంది. వృద్ధాప్యంలో ఎముకలకు బలాన్ని ఇచ్చి, ఎముకలను దృఢంగా మారుస్తుంది.

కర్బూజా పండులో విటమిన్ సి – విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. కర్బూజా రసాన్ని చర్మంపై పూతగా రాస్తే ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులు నయమవుతాయి. ఇందులో ఉండే ఫోలిక్ ఆమ్లం గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం. బాలింతలకు పాలు వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఎండల్లో తిరిగి అలసట అనిపించినప్పుడు, ఈ పండు తక్షణ శక్తినిచ్చి, శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. మండే ఎండల్లో ఇది శరీరానికి చల్లదనాన్ని, శక్తిని, మనసుకు తాజాదనాన్ని అందిస్తుంది. చెమట రూపంలో కోల్పోయే ఖనిజ లవణాలను తిరిగి నింపుతుంది.

లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..

కర్బూజాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను ధ్వంసం చేసే ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తాయి. విటమిన్ ఎ కంటి చూపును పెంచుతుంది. ఈ సీజన్‌లో కర్బూజా పండును తరచుగా తీసుకోవడం వల్ల అసిడిటీ, కడుపులో పుండ్ల సమస్యలకు ఔషధంగా పనిచేసి తగ్గిస్తుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కర్బూజా పండు రసం తాగడం వల్ల శృంగార శక్తి పెరుగుతుంది.. వీర్యం వృద్ధి చెందుతుంది.. వైవాహిక జీవితం ఆనందమయం అవుతుంది.

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మగమహారాజులకు వరం ఈ పండు.. డైలీ తిన్నారంటే ఆ విషయంలో తిరుగుండదు..
మగమహారాజులకు వరం ఈ పండు.. డైలీ తిన్నారంటే ఆ విషయంలో తిరుగుండదు..
OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ సిరీస్
OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ సిరీస్
పాముల గురించి ఈ భయంకర నిజాలు తెలిస్తే.. భయపడి పారిపోతారు!
పాముల గురించి ఈ భయంకర నిజాలు తెలిస్తే.. భయపడి పారిపోతారు!
సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
తిథి ప్రాముఖ్యత ఏమిటి? ఆ తిథుల్లోనే శుభ కార్యాలు ఎందుకు..
తిథి ప్రాముఖ్యత ఏమిటి? ఆ తిథుల్లోనే శుభ కార్యాలు ఎందుకు..
ఆధార్ కార్డు కాదు.. ఇకపై ఇది ఉంటేనే మహిళలకు ఫ్రీ బస్సు..!
ఆధార్ కార్డు కాదు.. ఇకపై ఇది ఉంటేనే మహిళలకు ఫ్రీ బస్సు..!
పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. ముంచుకొస్తోన్న భారీ ప్రమాదం..?
పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. ముంచుకొస్తోన్న భారీ ప్రమాదం..?
50 మంది పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం.. ఇది కదా అసలైన ఎఫెక్ట్..?
50 మంది పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం.. ఇది కదా అసలైన ఎఫెక్ట్..?
పాఠశాలల్లో ఇక ముద్ద అన్నానికి గుడ్ బై.!
పాఠశాలల్లో ఇక ముద్ద అన్నానికి గుడ్ బై.!
భారత్‌తో కుదిరిన ఒప్పందానికి వచ్చే ముప్పేమీ లేదు: ట్రంప్‌
భారత్‌తో కుదిరిన ఒప్పందానికి వచ్చే ముప్పేమీ లేదు: ట్రంప్‌