TS Inter Supply Results 2022: రేపు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
లంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు (ఆగస్టు 30) విడుదలకానున్నాయి..
TS Inter Supplementary Results 2022 Date: తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు (ఆగస్టు 30) విడుదలకానున్నాయి. రేపు ఉదయం 9 గంటల 30 నిముషాలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫలితాల వెల్లడి అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.కాగా ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,28,262 మంది హాజరుకాగా, జూన్ 20న ప్రకటించిన ఫలితాల్లో ఫస్టియర్‌లో 2,94,378 మంది, సెకండియర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.