TS Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. మరికాసేపట్లో సప్లి ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..
TS Inter Supplementary Results 2022 Date: తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్. మరికాసేపట్లో సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. ఉదయం 9 గంటల 30...
TS Inter Supplementary Results 2022 Date: తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్. మరికాసేపట్లో సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. ఫలితాలు విడుదల చేసిన వెంటనే రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇదిలా ఉంటే ఇంటర్ రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ వారికి ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,28,262 మంది హాజరుకాగా ఫస్టియర్‌లో 2,94,378 మంది, సెకండియర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రాకముందే ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలైన విషయం తెలిసిందే. అయితే సప్లిమెంటరీ పరీక్ష రాసి ఫలితాలు కోసం ఎదురు చూస్తున్న 1.13 లక్షల మంది మాత్రం తొలి విడుత కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థుల కోసం ఉన్నత విత్యమండలి ఎంసెట్‌కు హాజరయ్యే అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రిజిస్ట్రేషన్, ఆప్షన్ల నమోదు తేదీలను పొడిగించాలని నిర్ణయించారు. ఈ విషయమై ఉన్నత విద్యామండలి అధికారులు మంగళవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..