AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీకు దురద, కంటి వాపు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీ కిడ్నీలకు గండమేనట..

మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రభావం అంటే తీవ్రమైన వ్యాధిగా పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీలు జాగ్రత్తగా చూసుకుంటే.. మన ఆరోగ్యం కూడా బాగుంటుందని పేర్కొంటున్నారు.

Health Tips: మీకు దురద, కంటి వాపు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీ కిడ్నీలకు గండమేనట..
Kidney Health
Shaik Madar Saheb
|

Updated on: Aug 29, 2022 | 4:14 PM

Share

Kidney Care Tips: మూత్రపిండాలు మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి.. మన శరీరంలో ఏర్పడిన వ్యర్థాలు, అదనపు ద్రవాలను కిడ్నీలు తొలగిస్తాయి. శరీరంలోని కణాలలో ఏర్పడిన యాసిడ్‌ కిడ్నీ సహాయంతో తగ్గుతుంది. రక్తంలో నీరు, సోడియం, కాల్షియం, భాస్వరం, పొటాషియం వంటి మూలకాలను సమతుల్యం చేసే పనిని కూడా మూత్రపిండాలు చేస్తాయి. కిడ్నీలో ఎలాంటి సమస్య వచ్చినా అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. అందువల్ల మూత్రపిండాల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రభావం అంటే తీవ్రమైన వ్యాధిగా పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీలు జాగ్రత్తగా చూసుకుంటే.. మన ఆరోగ్యం కూడా బాగుంటుందని పేర్కొంటున్నారు.

అందుకే కిడ్నీలకు మేలు చేసే వాటిని మీ ఆహారంలో చేర్చుకోవాలి. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరంలో ఎప్పుడూ నీటి కొరత రాకూడదు. రోజూ సరిపడినంత తాగునీరు తాగడం చాలా ముఖ్యం. కిడ్నీ ప్రభావితమైతే శరీరం మొత్తం ప్రభావితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, దాని గురించి అజాగ్రత్తగా ఉండకూడదు. సాధారణంగా మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు కిడ్నీ ఫెయిల్యూర్‌కు సంకేతాలుగా కనిపిస్తాయి. అయితే కళ్ళు, చర్మం సహాయంతో మీరు కిడ్నీల పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

చర్మ సమస్యలు: కిడ్నీ సరిగా పనిచేయకపోతే చర్మం పొడిబారడం, పొట్టు, దురద వంటి సమస్యలు రావచ్చు. నిజానికి కిడ్నీలు మన రక్తంలోని టాక్సిన్‌లను ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన రక్తాన్ని చర్మానికి పంపుతాయి. ఇది సరిగ్గా పని చేయకపోతే, వివిధ చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మన రక్తంలో విషపదార్థాల పెరుగుదల ఏమైనప్పటికీ తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమని భావిస్తారు.

కంటి సమస్యలు: కిడ్నీలో ఎలాంటి సమస్య వచ్చినా కంటి సమస్యలు కూడా వస్తాయి. మీ కళ్ల చుట్టూ వాపు వచ్చినట్లు అనిపించినా.. కంటి చూపు స్పష్టంగా లేకపోయినా..? అటువంటి పరిస్థితిలో, మీ కిడ్నీలను పరీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..