నయనతారకు షాకిచ్చిన సాయిపల్లవి.. ఇప్పుడు అమ్మడిదే జోరు..
Rajitha Chanti
Pic credit - Instagram
20 February 2026
ప్రేమమ్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన సాయి పల్లవి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళం, హిందీలో నటిస్తూ బిజీగా ఉంటుంది.
ప్రస్తుతం హిందీలో రెండు సినిమాల్లో నటిస్తున్న సాయి పల్లవి.. ఇటీవలే తమిళంలో ధనుష్ సరసన మరోసారి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది సాయి పల్లవి. ఇప్పుడు పారితోషికం విషయంలో నయనతారను వెనక్కు నెట్టింది ఈ ముద్దుగుమ్మ.
2024లో విడుదలైన అమరన్ సినిమా తర్వాత సాయి పల్లవి మరింత బిజీ హీరోయిన్ అయ్యింది. ప్రస్తుతం ధనుష్, రాజ్ కుమార్ పెరియసామి కాంబోలో ఓ సినిమా వస్తుంది.
ఇందులో సాయి పల్లవి, శ్రీలీల కథనాయికలుగా నటించనున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కాగా.. ఇప్పుడొక ఆసక్తికర వార్త వైరలవుతుంది
ఈ సినిమా కోసం సాయి పల్లవి ఏకంగా రూ.12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. అంటే ఇప్పుడు నయనతార కంటే ఎక్కువ వసూలు చేస్తుంది.
ఇటీవలే మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది నయనతార. ప్రస్తుతం యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రంలో నటిస్తుంది.
ఈ సినిమాకు నయన్ రూ.10 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటుంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ సాయి పల్లవి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్