AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పెదవులు, చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు అది జుట్టు, చర్మంపై కూడా ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు డీహైడ్రేషన్ కారణంగా చర్మం కూడా పొడిగా, నిర్జీవంగా మారుతుంది.

Health Tips: పెదవులు, చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
Health Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 29, 2022 | 7:48 PM

Dehydration Symptoms On Skin: శరీరంలో నీటి కొరత కారణంగా అనేక వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే రోజూ తగినంత నీరు తాగాలని నిపుణులు సూచిస్తుంటారు. నీటి కొరత కారణంగా మైకము, నోరు పొడిబారడం, అలసట వంటి లక్షణాలను కనిపిస్తాయి. కానీ శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు అది జుట్టు, చర్మంపై కూడా ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు డీహైడ్రేషన్ కారణంగా చర్మం కూడా పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో నీటి కొరత కారణంగా చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? వాటి లక్షణాలు ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలో నీటి కొరత చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..

పొడి చర్మం: అందరికీ చర్మం ఒకేలా ఉండకుండా.. భిన్నంగా ఉంటుంది. కొందరికి చర్మం పొడిబారుతుంది, మరికొందరికి జిడ్డుగా ఉంటుంది. అయితే కొందరికి శరీరంలో నీరు లేకపోవడం వల్ల చర్మం పొడిగా మారుతుంది. అదే సమయంలో శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు మన చర్మం డీహైడ్రేట్ అవుతుంది. దీని కారణంగా చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో చర్మం నిర్జీవంగా మారి ముడతలుగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

పెదవుల మీద స్కాబ్స్: పెదవులపై క్రస్ట్‌లు పేరుకుపోవడం కూడా డీహైడ్రేషన్ చర్మం లక్షణం. శరీరంలో నీరు లేకపోవడం వల్ల పెదవులపై డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం మొదలవుతుంది. పెదవుల నుంచి రక్తం కారడం, పొట్లుపొట్లుగా కనిపించడం మొదలవుతుంది.

చర్మంపై దురద: చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీటి కొరత కారణంగా చర్మంపై దురద, ఎరుపు వంటి సమస్యలు ఉండవచ్చు. దీనితో పాటు చర్మంపై దద్దుర్లు కూడా సంభవించవచ్చు. దీన్ని నివారించడానికి నీరు పుష్కలంగా తాగాలి.

తక్కువ వయస్సులోనే ముడతలు: వయసు పెరిగే కొద్దీ చేతులపై ముడతలు పడటం సర్వసాధారణం. కానీ చిన్న వయసులోనే ముఖంపై, చేతులపై ముడతలు పడుతున్నాయంటే మీ శరీరంలో నీటి కొరత ఉందని అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..