AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosquitoes Bite: ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారినే దోమలు ఎక్కువగా కుడుతాయట! ఎందుకో తెలుసా..

దోమలు కుట్టనివారు ఈ భూమిపై బహుశా ఉండరేమో! ప్రతీ ఇంట్లో దోమలు కనిపిస్తాయి. మీకు తెలుసా? దోమలు కొందరిని మాత్రమే సెలక్టివ్‌గా ఎంచుకుని వారినే ఎక్కువగా కుడతాయట. కొంతమంది జోలికి అస్సలు వెళ్లవట. నిజానికి దోమల్లో..

Mosquitoes Bite: ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారినే దోమలు ఎక్కువగా కుడుతాయట! ఎందుకో తెలుసా..
Mosquitoes
Srilakshmi C
|

Updated on: Aug 29, 2022 | 8:03 PM

Share

Are Mosquitoes Attracted to Certain Blood Types: దోమలు కుట్టనివారు ఈ భూమిపై బహుశా ఉండరేమో! ప్రతీ ఇంట్లో దోమలు కనిపిస్తాయి. మీకు తెలుసా? దోమలు కొందరిని మాత్రమే సెలక్టివ్‌గా ఎంచుకుని వారినే ఎక్కువగా కుడతాయట. కొంతమంది జోలికి అస్సలు వెళ్లవట. నిజానికి దోమల్లో ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడతాయి. ఇవి రక్తం ద్వారా మన శరీరం నుంచి ప్రోటీన్లు సేకరిస్తాయి. అందునా కొన్ని బ్లడ్ గ్రూపుల వారిని ఎక్కువగా కుడుతున్నట్లు అధ్యయనాలు తెల్పుతున్నాయి. ముఖ్యంగా A-గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తులను దోమలు ఎక్కువగా కుడతాయి. ఐతే O-బ్లడ్ గ్రూప్ వ్యక్తులను అంతకంటే రెట్టింపు కుడతాయి. మనుషుల శ్వాస ద్వారా వ్యక్తుల బ్లడ్‌ గ్రూప్‌లను దోమలు గుర్తించగలవు. కార్బన్ డయాక్సైడ్‌తో పాటు, దోమలు లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, అమ్మోనియా, చెమట ద్వారా విడుదలయ్యే ఇతర పదార్థాలను వాసన చూడగలవు. లాక్టిక్ ఆమ్లం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా దోమలు గుర్తించగలుగుతాయి. అలాగే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిని కూడా దోమలు అధికంగా కుడతాయి.

2011లో జరిపిన ఓ అధ్యయనంలో పరిశోధకులు ఈ విషయాలను వెల్లడించారు. కొంతమందికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వీరి పరిశోధనల్లో బయటపడింది. బీరు ఎక్కువగా తాగే వారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయి. రోజూ బీరు తాగేవారి చెమట ద్వారా ఇథనాల్ విడుదలవుతుంది. కాబట్టి బీర్ ప్రియులకు దోమల బెడద ఎక్కువేనని చెప్పవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలను కూడా దోమలు ఎక్కువగా కుడతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు కారణం ఏంటంటే..ప్రగ్నెంట్‌ స్త్రీల శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే వారి శరీరం నుంచి ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. దానివల్ల దోమలు ఎక్కువగా ఆకర్షితులవుతాయి.

ఇవి కూడా చదవండి

మనుషులను దోమలు వాసన ద్వారా గుర్తిస్తాయని చెప్పుకున్నాం కదా! దీనితోపాటు ధరించే దుస్తులను బట్టి కూడా కుడతాయట. నలుపు, ముదురు నీలం, ఎరుపు రంగు దుస్తులు ధరించే వారు దోమలు ఎక్కువగా ఆకర్షితులవుతాయి. అలాగే జన్యుపరమైన కారణాల వల్ల కూడా దోమలు ఎక్కువగా కుడతాయి. అర్థమైంది కాదా! మీలో ఎవరినైనా దోమలు అధికంగా కుడుతుంటే.. పై కారణాల్లో ఏదో ఒకటి కారణం అని తెలుసుకోండి..