- Telugu News Photo Gallery Why eating late at night is Harmful to Your Heart Health. know here in detail
Health Tips: రాత్రిళ్లు భోజనం ఆలస్యంగా తింటున్నారా? ఐతే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం ఆరోగ్యానికి హానికరం. ఆలస్యంగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..
Updated on: Aug 29, 2022 | 5:00 PM

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం ఆరోగ్యానికి హానికరం. ఆలస్యంగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..

రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువ. ఎల్లప్పుడు రాత్రిపూట ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. అలాగే రాత్రిళ్లు ఫాస్ట్ ఫుడ్ తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ అలవాట్ల వల్ల బరువు విపరీతంగా పెరుగుతుంది.

క్రమంగా జీవక్రియ రేటు నెమ్మదిగా పనిచేయడం ప్రారంభమవుతుంది. దీని వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకునే అలవాటును మానుకోవడం బెటర్.

ఆలస్యంగా తిన్న ఆహారం ప్రభావం నిద్రపై కూడా పడుతుంది. రాత్రిపూట ఆలస్యంగా తీసుకున్న ఆహారం వల్ల శరీర సహజ చక్రంపై చెడు ప్రభావం పడుతుంది. ఫలితంగా రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టదు.

అధిక రక్తపోటు (బీపీ)తోపాటు, మధుమేహం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలను కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి.




