రంజాన్‌ నెలలో ఖర్జూరాలు ఎందుకు తినాలో తెలుసా?

20  February 2026

TV9 Telugu

TV9 Telugu

రోజంతా పచ్చినీళ్లు కూడా ముట్టకుండా నెల రోజులపాటు రంజాన్‌ మాసంలో ఆచరించే కఠిన ఉపవాస దీక్ష ప్రారంభమైంది. అయితే రోజూ ఈ దీక్ష విరమించేటప్పుడు తీసుకునే ఆహార పదార్థాల్లో ఖర్జూరం తప్పకుండా ఉంటుంది

TV9 Telugu

జీర్ణ వ్యవస్థకు సుదీర్ఘమైన విశ్రాంతినిచ్చి పునరుజ్జీవం కల్పించేందుకు ఈ పండు ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు ఖర్జూరంలో దండిగా ఉంటాయి

TV9 Telugu

పొటాషియం ఎక్కువగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయట. అలాగే ఖర్జూరం పండ్లలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి

TV9 Telugu

ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్ తక్కువగా.. ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగి.. బరువు అదుపులో ఉంచుకోవచ్చు

TV9 Telugu

క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్.. వంటి ఖనిజాలు ఈ పండులో అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి, ఎర్రరక్తకణాల ఉత్పత్తికి, ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి

TV9 Telugu

ఖర్జూరాలు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. బాగా సన్నగా ఉండి బరువు పెరగాలనుకునే వారికీ మంచి ఫలితాన్నిస్తాయని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

ఖర్జూరం పండు శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అందుకే రంజాన్ ఉపవాస దీక్షల సమయంలో ఈ పండుని ఆహారంగా తీసుకుంటారు. మలబద్ధకంతో బాధపడేవారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తిని, ఆ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుందట

TV9 Telugu

ఖర్జూరంలో ఉండే వివిధ పోషకాలు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేయడంలో సహకరిస్తాయి. ఖర్జూరాల్లో ఉండే విటమిన్ ‘బి6’ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది