- Telugu News Photo Gallery Knowledge Why Indian Highways Have Red Green Yellow and Black Coloured Milestones Know the Reasons
Milestones Colour Secrete: పసుపు, ఆరెంజ్, గ్రీన్… మైల్ స్టోన్స్‌కు వేసే ఈ రంగులకు అర్థం ఏంటో తెలుసా?
Milestones Colour Secrete: హైవే పై వెళ్తున్నప్పుడు మనకు రోడ్డు పక్కన మైలు రాయి కనిపిస్తుంది. అది మన గమ్యం ఎంత దూరం ఉందో తెలియజేస్తుంది. అయితే, మైలురాళ్లకు విభిన్నమైన రంగులు వేస్తారు. రకరకాల రంగులతో కూడిన మైలురాళ్లు రోడ్డుపై ఏర్పాటు చేస్తారు.
Updated on: Aug 27, 2022 | 4:04 PM

హైవే పై వెళ్తున్నప్పుడు మనకు రోడ్డు పక్కన మైలు రాయి కనిపిస్తుంది. అది మన గమ్యం ఎంత దూరం ఉందో తెలియజేస్తుంది. అయితే, మైలురాళ్లకు విభిన్నమైన రంగులు వేస్తారు. రకరకాల రంగులతో కూడిన మైలురాళ్లు రోడ్డుపై ఏర్పాటు చేస్తారు. వాటిలో ఎల్లో, ఆరెంజ్, బ్లాక్, గ్రీన్ రంగుల్లో మైలురాళ్లు కనిపిస్తాయి. మరి ఆ మైలు రాళ్లు రంగుల్లో ఎందుకు ఉంటాయని ఎవరికైనా తెలుసా? హైవే పై ఉన్న ఈ రాళ్ల రంగుల వెనుక ఉన్న అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పసుపు రంగు: మైలు రాయికి పసుపు రంగు ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. హైవే పై వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన పసుపు రంగు వేసిన మైలు రాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని జాతీయ రహదారిపై మాత్రమే ఏర్పాటు చేస్తారు. వీటి నిర్వహణ అంతా కేంద్ర ప్రభుత్వానిదే.

కొన్ని రోడ్లపై పచ్చని స్ట్రిప్స్‌తో మైల్ స్టోన్స్ ఉంటాయి. అవి రాష్ట్ర రహదారులను సూచిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా హైవే, రోడ్డు నిర్మిస్తే ఆ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన మైలు రాయికి పచ్చన స్ట్రిప్స్‌తో కూడిన రంగులు వేయడం జరిగింది. ఈ రహదారి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుందని దీని అర్థం. ఈ రహదారి రాష్ట్రంలోని ఒక నగరానికి మరొక నగరాన్ని కలుపుతుంది.

బ్లాక్, బ్లూ రంగులతో కూడిన మైలు రాయి కనిపిస్తే, అది పెద్ద నగరం, జిల్లా కేంద్రంలోకి ప్రవేశిస్తున్నారని అర్థం. ఈ రహదారి నిర్ధిష్ట జిల్లా లేదా నగరంలోకి ఎంటర్ అవుతుందని సూచిస్తుందన్నమాట. దీని నిర్వహణ అక్కడి పరిపాలనతో ముడిపడి ఉంటుంది.

ఆరెంజ్ రంగు మైల్ స్టోన్ గ్రామ రహదారుల కోసం ఉపయోగిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నారని ఈ మైలురాయి సూచిస్తుంది. ఉదాహరణకు ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యజన చిహ్నం కోసం నారింజ రంగును ఉపయోగిస్తారు.
