- Telugu News Photo Gallery Spiritual photos Chankya Niti in Telugu Acharaya Chankya says Never do these mistakes your enemy can defeat you.
Chanakya Niti: శత్రువుపై విజయం సాధించాలంటే.. జీవితంలో ఎప్పుడూ ఈ తప్పులు చేయవద్దు
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మనిషి జీవిత విధానాల గురించి చెప్పాడు. అందులో ఒకటి శత్రువును ఎలా ఓడించాలి. అయితే మీరు ఏ తప్పులు చేయకుండా ఉండాలో కూడా పేర్కొన్నారు. మీరు చేసే తప్పులు శత్రువులకు మేలు చేస్తాయి. ఈ తప్పుల గురించి తెలుసుకోండి.
Updated on: Aug 27, 2022 | 3:56 PM

ఎండిన తులసి మొక్క: ఇంటి ఆవరణలో ఉంచిన తులసి మొక్క ఎండిపోవడం అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. అలా ఎండిన తులసి మొక్క ఉన్న కుటుంబంలో లేదా ఇల్లు అసమ్మతిని లేదా గొడవలను ఎదుర్కోవలసి పరిస్థితులు ఏర్పడొచ్చని చాణక్య నీతి చెబుతోంది. అటువంటి తులసి మొక్కతో అనుబంధాన్ని కలిగి ఉండకుండా.. దానిని గౌరవంగా ఇంటి నుంచి తీసివేయాల్సి ఉంటుంది.

సందేహం: ఒకరినొకరు ఎప్పుడూ అనుమానించుకోకండి. సంబంధంలో సందేహాలు ఉంటే ఆ సంబంధాన్ని నాశనం చేయవచ్చు.కనుక మీ భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకండి. మీ భాగస్వామి గురించి మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే.. వెంటనే మీ భాగస్వామిని అడగడం ద్వారా ఆ అనుమానాన్ని ఆలోచనను దూరం చేసుకోండి.

చాలా సార్లు.. ఎంత కష్టపడి పని చేసినా ఏ పనిలోనూ విజయం సాధించలేము. పని ఒత్తిడి ఉంటే.. మనకు ఇష్టమైన వారిని కూడా దూరంగా ఉంచుతాం. అయితే ఎంత కష్టపడినా జీవితంలో మనం ఏమీ సాధించలేకపోతున్నాం అనుకునేవారు ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. కొన్ని జంతువుల లక్షణాల నుంచి నేర్చుకోవడం ద్వారా.. వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు.

కొంగ - కొంగకు తన ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో తెలుసు. అదే విధంగా సంయమనంతో పని చేస్తే విజయం సులువుగా దొరుకుతుంది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కాబట్టి మీ మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఏకాగ్రతతో పని చేయండి.

కోడి పుంజు - సూర్యోదయానికి ముందే కోడిపుంజు లేస్తుంది. అంతేకాదు వ్యతిరేకశక్తులపై పోరాడుతుంది. ఆహారాన్ని పంచుకోవడం, మీ స్వంత శక్తితో ఆహారం పొందడం. ఈ లక్షణాలన్నీ ఒక వ్యక్తి కోడి నుండి నేర్చుకోవచ్చు. ఈ లక్షణాలు మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి.




