Cyber Crime: సర్కార్‌ వారి సైట్లని ఓపెన్ చేస్తున్నారా? మీ కొంప కొల్లేరే ఇక..!

Cyber Crime: ఈ జగమంతా ఇప్పుడు బుల్లి పెట్టెలోనే ఉంది. అదేనండీ సెల్‌ ఫోన్. సెల్ ఫోన్ సాయంతో అన్ని పనులూ జరిగిపోతున్నాయి.

Cyber Crime: సర్కార్‌ వారి సైట్లని ఓపెన్ చేస్తున్నారా? మీ కొంప కొల్లేరే ఇక..!
Cybercrime
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 14, 2022 | 10:39 PM

Cyber Crime: ఈ జగమంతా ఇప్పుడు బుల్లి పెట్టెలోనే ఉంది. అదేనండీ సెల్‌ ఫోన్. సెల్ ఫోన్ సాయంతో అన్ని పనులూ జరిగిపోతున్నాయి. యావత్ ప్రపంచం ఈ పట్నం నుంచి పల్లెదాక ఇప్పుడంతా ఆన్‌లైన్‌ బిజినెసే. కోరకున్న వస్తువు నిమిషాల్లో డోర్‌ ముందుకు వచ్చేస్తుంది. ఆన్‌లైన్‌ సిస్టమ్‌ అంత సూపర్ ఫాస్ట్ అయ్యింది. అయితే, ఇదంతా పైకి మాత్రమే. ఇక క్లియర్‌గా చెప్పాలంటే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. మరి రెండోవైపు చూస్తే.. ఆన్‌లైన్‌ చాటున తీరొక్క మోసాలు దాగున్నాయి. ఆ మోసాలకు గురై ఎంతో మంది సర్వం కోల్పోతున్నారు.

బంపర్‌ ఆఫర్ల పేరిట దగా లింకులు.. టచ్‌ చేస్తే ఖాతాలో క్యాష్‌ కల్లాస్‌.. ఇదీ ప్రస్తుతం నడుస్తోన్న మోసాల తీరు. ఆఫర్ల పేరుతో లింకులను ఎరగా వేసి ఖాతాలను కొల్లగొడుతున్నారు సైబర్‌ క్రిమినల్స్‌. నిజమేనని నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల డేటా చెప్పారో అంతే సంగతులు. మరో మాటలేకుండా మోసపోయినట్టే. న్యాయం చేయండి మహాప్రభో అని సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించాల్సిందే. ఈలోపే సైబర్‌ క్రిమినల్స్‌ ఊడ్చాల్సిందంతా ఊడ్చేస్తారు. క్యాలెండర్లు మారాల్సిందే కానీ కేసులు తేలవు. ఈ కథ ఇలా వుంటే.. ఇటీవల మరో రకం మోసం మొదలైంది.

సైబర్‌ కేటుగాళ్ల ట్రాప్‌లో పడొద్దని పోలీసులు చెవిలో జోరిగలా అవగాహన కల్పిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ మోసపోయిన బాధితులు సొమ్ము రికవరీ కోసం కొత్త దారులు వెదుక్కుతున్నారు. గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే కన్స్యూమర్‌ కంప్లేంట్స్‌, కంప్లేంట్‌ రూమ్‌, ఆన్‌లైన్‌ లీగల్‌ ఇండియా, గో ఇండియా లీగల్‌, జన సురక్షణ కేంద్ర వంటి సైట్లు తళుక్కుమంటున్నాయి.

ఇవి కూడా చదవండి

www.consumercomplaints.info,

www.onlineleagalindia.com,

www.consumerchanakya.com,

www.goindialeagal.com,

www.janasurakshakendra.in,

పేర్లను చూసి ఇవన్నీ సర్కార్‌ వారి సైట్లు అని నమ్మి లింక్‌ టచ్‌ చేస్తే .. సదా మీ సేవలో అన్నంత బిల్డప్‌తో పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. పొయిన సొమ్ము రికవరీ చేయాలంటే మీ డేటా కావాలి కదా. అందుకే వివరాలను చెప్పండని ఊరిస్తూ.. బ్యాంక్‌ ఖాతా, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలను తీసుకుంటారు. న్యాయం జరుగుతుందనే ఆశతో బాధితులు ఆ వివరాలన్నీ ఫిల్‌ చేస్తారు. ఆ తరువాత తెలుస్తుంది మరోసారి మోసపోయారనే నిజం.

శతకోటి మోసాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు.. వాటిలో ఇదో రకమైన మోసం అన్నమాట. అన్ని వివరాలు తెలుసుకొని ఖాతాలో ఉన్న డబ్బును కొల్లగొట్టి మరోసారి మోసం చేస్తారు. కస్టమర్లకు డౌట్‌ రాకుండా.. మీ సొమ్ము రికవరీ చేస్తాం.. మీకు న్యాయం చేస్తామని నమ్మించడానికి ప్రాసెసింగ్‌ ఫీజు కూడా లాగించేస్తారు. గత పది రోజుల్లో ఈ తరహా మోసాలపై ఫిర్యాదులు అందడంతో సైబర్‌ క్రైం పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ ఆరు నకిలీ వెబ్‌సైట్లను గుర్తించారు.

పోలీసుల వార్నింగ్.. పైన పేర్కొన్న వెబ్‌సైట్లతో పాటు.. అనామక వెబ్ సైట్లలో లాగిన్‌ అయి డిటెయిల్స్‌ ఇస్తే చాలు, మన బీరువాలో ఉన్న డబ్బులని వాళ్ల చేతికి అప్పగించినట్టే. ఇలాంటి వెబ్‌సైట్లను నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఆన్‌లైన్‌లో డబ్బులు పొగొట్టుకున్న వాళ్లు.. 1930 లేదా 155260 నంబర్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఫైనల్ వార్నింగ్.. కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బులను ఏమరపాటుతో సైబర్‌ దొంగల పాలు చేయకండి. నెట్లో వచ్చిన ప్రతి నెంబర్‌ను నమ్మి కాల్‌ చేయకండి. అవసరం లేని లింకులను ఓపెన్‌ చేయకండి. ముఖ్యంగా.. మీ ఏటీఎం కార్డుపై ఉన్న నెంబర్లు, సీవీవీ, వ్యక్తిగత వివరాలను ఎవరితో షేర్‌ చేసుకోకండి. మీ డీటెయిల్స్‌ను అడిగే హక్కు ఏ బ్యాంకుకు కూడా లేదు. మీ ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ షేర్‌ చేయకూడదు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!