Toddy Palm Fruit: కోనసీమ జిల్లాలో సందడి చేస్తున్న తాటిపండ్ల వంటకాలు.. తింటే మైమరచిపోవాల్సిందే..

Toddy Palm Fruit: తాటి పండుతో వంటకాలు అంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాని దాని రుచి మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగని ఇదేదో పెద్ద ఖరీదైన..

Toddy Palm Fruit: కోనసీమ జిల్లాలో సందడి చేస్తున్న తాటిపండ్ల వంటకాలు.. తింటే మైమరచిపోవాల్సిందే..
Toddy Palm Fruit
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 26, 2022 | 4:20 PM

Toddy Palm Fruit: తాటి పండుతో వంటకాలు అంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాని దాని రుచి మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగని ఇదేదో పెద్ద ఖరీదైన పండు కాదండోయ్. విదేశాలనుండి వచ్చింది కూడా కాదు. మార్కెట్లో పెద్దగా లభ్యమయ్యేది కాదు. చెట్టు నుంచి పండిన తర్వాత సహజంగానే కింద పడుతుంది. ఆ పండు ఎంత రుచిగా ఉంటుందో.. ఆ పండుతో తయారు చేసిన వంటకాలు కూడా అంతే రుచిగానూ, అంతకంటే ఆరోగ్య ప్రధాయినిగానూ ఉంటుంది. అదే మన గ్రామీణ పండు తాటిపండు.

మానవాళికి తాటి సంపద ఎంతో ప్రయోజనకరమైంది. ముంజలు, పండ్లు, తేగలు ఇలా అన్ని విధాలుగాను మనకు ఉపయోగపడుతుంది. మూడు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ తాటిపండుతో కడుపునింపుకునే వారు. నేరుగా కొందరు, వేడి చేసుకుని మరికొందరు ఈ పండును తినేవారు. అయితే చేతికి, మూతికి అంటుకుంటుందని క్రమేపీ దూరం పెడుతూ వస్తున్నారు. ప్రస్తుత సీజన్లో లభ్యమయ్యే తాటి పండు గురించి తెలుసుకోవడం ఆవశ్యకం. ఎందుకంటే ఇది ఎన్నో పోషకాలు కలిగి ఉంది. ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వాడకుండా సహజంగ లభించే పండు ఇది. మగ్గడానికి రసాయనాలు వినియోగించే ప్రసక్తే లేదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మరీ ముఖ్యంగా కోనసీమ ప్రాంతాల్లో ఈ పండుతో తయారు చేసే వంటకాలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ తాటి పండు గుజ్జు నుంచి తయారు చేసే గారెలు, బూరెలు, ఇడ్లీలు, దిబ్బరొట్టెలు వంటి ఎన్నో వంటకాలు రుచిచూడడానికి పోటీ పడుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఈ తాటిపండుతో తయారు చేసిన వంటకాలకు ప్రత్యేకం. అలసి పోయి ఇంటికి వచ్చిన ఇంటి పెద్దలకు.. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన విద్యార్థులకు ఇంట్లో అమ్మ నాన్నమ్మలు చేసి పెట్టే వంటకమే తాటి పండు వంటకం. ఇప్పుడు రాజమండ్రి, కాకినాడ సిటీలో కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక తాటి పండు ధర 30 నుంచి 40 రూపాయలు అమ్ముతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్లి టేస్ట్ చేసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్  చేయండి..

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే