Andhra: యాక్సిడెంట్‌కు గురైన ఆటోలో కదులుతూ కనిపించిన మూటలు.. ఏముందా అని చెక్ చేయగా షాక్

రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢికొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఇక్కడ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

Andhra: యాక్సిడెంట్‌కు గురైన ఆటోలో కదులుతూ కనిపించిన మూటలు.. ఏముందా అని చెక్ చేయగా షాక్
Ap Road Accident
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 26, 2022 | 4:45 PM

AP Crime News: గప్‌చుప్‌గా మన వన్య ప్రాణులను బోర్డర్స్ దాటించేస్తున్నారు. కేటుగాళ్లు అక్రమ రవాణాలో ఆరితేరిపోతున్నారు. పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు అనుమానం రాకుండా మన అడవుల్లోని అరుదైన జీవులను గట్లు దాటించేస్తున్నారు. తాజాగా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా(konaseema district) ముమ్మిడివరం సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం.. తాబేళ్ల అక్రమ రవాణాను బయటపెట్టింది.  కాట్రేనికోన మండలం(Katrenikona Mandal) చెయ్యరు అగ్రహారం వద్ద అమలాపురం వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.  ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 సాయంతో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన చోట ఓ తాబేలు కూడా చనిపోయి పడి ఉంది. రోడ్డు దాడుతూ వాహనాల టైర్ల కింద అది పడిందేమో అని తొలుత అనుకున్నారు. కానీ యాక్సిడెంట్‌కు గురైన ఆటోలో ఉన్న మూటలు కదులుతూ కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి ఆ సంచులు విప్పగా లోపల 15 తాబేళ్లు ఉన్నాయి. దీంతో తాబేళ్లను అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు గుర్తించారు. సమాచారంతో స్పాట్‌కు చేరకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..