AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC: దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ.. ఫేక్‌ వర్సిటీల జాబితాను విడుదల చేసి యూజీసీ..

Fake University List By UGC: భారత్‌లో ప్రస్తుతం 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ తెలిపింది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ చట్టం - 1956కు వ్యతిరేకంగా దేశంలో 21 వర్సిటీలు పనిచేస్తున్నాయని తెలిపింది...

UGC: దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ.. ఫేక్‌ వర్సిటీల జాబితాను విడుదల చేసి యూజీసీ..
Fake Universities
Narender Vaitla
|

Updated on: Aug 26, 2022 | 5:13 PM

Share

Fake University List By UGC: భారత్‌లో ప్రస్తుతం 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ తెలిపింది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ చట్టం – 1956కు వ్యతిరేకంగా దేశంలో 21 వర్సిటీలు పనిచేస్తున్నాయని తెలిపింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యూనివర్సిటీ కూడా ఉండడం గమనార్హం. ఈ యూనివర్సిటీలకు విద్యార్థులకు డిగ్రీలు ఇచ్చే అధికారం లేదని యూజీసీ తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే యూజీసీ ఫేక్‌ వర్సిటీల జాబితాను విడుదల చేసింది.

దేశంలో ఉన్న ఫేక్‌ యూనివర్సిటీల జాబితాను విడుదల చేస్తూ యూజీసీ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర/ ప్రావిన్షియల్ చట్టం ప్రకారం ఏర్పడిన యూనివర్సిటీలు లేదా డీమ్డ్-టు-బి యూనివర్సిటీలు మాత్రమే డిగ్రీలను ప్రదానం చేయడానికి అర్హత ఉంది. అలాగే, ప్రత్యేకించి పార్లమెంట్ చట్టం ద్వారా అధికారం పొందిన సంస్థలు కూడా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తాయని యూజీసీ తెలిపింది. యూజీసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్‌లో 4, పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో రెండు చొప్పున నకిలీ వర్సిటీలు ఉన్నాయి. అలాగే కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో ఫేక్‌ వర్సిటీ ఉంది.

ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఫేక్‌ వర్సిటీలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌: క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ‌.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ: కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPPHS), యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఏడీఆర్(ADR)-సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (స్పిరిట్చువల్ యూనివర్సిటీ), విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్.

ఉత్తరప్రదేశ్‌: గాంధీ హిందీ విద్యాపీఠం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, భారతీయ శిక్షా పరిషత్.

ఒడిశా: నార్త్ ఒరిస్సా అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, నవభారత్ శిక్షా పరిషత్ యూనివర్సిటీ.

వెస్ట్‌ బెంగాల్‌: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్.

కర్ణాటక: బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్ కర్ణాటక.

కేరళ:సెయింట్ జాన్స్ యూనివర్సిటీ- కిషనట్టం

మహారాష్ట్ర: రాజా అరబిక్ యూనివర్సిటీ- నాగ్‌పూర్

పుదుచ్చేరి: శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్

Ugc

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..