TS Edcet: తెలంగాణ ఎడ్‌సెట్ పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
TS Edcet: తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 26వ తేదీన ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అధికారులు ఈ పరీక్షా ఫలితాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఉన్న విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్..
TS Edcet: తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 26వ తేదీన ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అధికారులు ఈ పరీక్షా ఫలితాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఉన్న విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. జూలై 26న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 31,578 మంది హాజరుకాగా వీరిలో 30,580 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో మేడ్చల్‌కు చెందిన అభిషేక్ మోహంతికి మొదటి ర్యాంక్ సాధించగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆంజనేయులు రెండో ర్యాంక్ సాధించాడు. మేడ్చల్‌కు చెందిన ముకేష్‌కు మూడో ర్యాంక్, జనగామకు చెందిన మహేష్ కుమార్‌కు 4వ ర్యాంక్, మేడ్చల్‌కు చెందిన అర్హద్ అహ్మద్ ఐదో ర్యాంక్ దక్కించుకన్నాడు.
ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం ముందుగా వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి. అనంతరం అభ్యర్థి తన పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే రిజల్ట్స్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. ఎడ్‌సెట్ ర్యాంక్ ఆధారంగా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ తెలంగాణలోని పలు కాలేజీల్లో రెండేళ్ల బీఈడీ రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.
ప్రభుత్వం అనుమతి లేకుండా అడ్మిషన్లు చేపడితే చర్యలు: ఉన్నత విద్యామండలి చైర్మన్
ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ కళాశాల కానీ, యూనివర్సిటి కానీ ప్రభుత్వం అనుమతి లేకుండా అడ్మిషన్లు చేయకూడదని తెలిపారు. ఒకవేళ అడ్మిషన్లు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ తరువాతనే B క్యాటగిరి ( మేనేజ్మెంట్) సీట్ల అడ్మిషన్లు ఇంజనీరింగ్ కాలేజీలు భర్తీ చేయాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా షెడ్యుల్ కంటే ముందుగా అడ్మిషన్లు చేస్తే అవి చెల్లవని వివరించారు. కాలేజీలు ఏవైనా ముందుగా బీ క్యాటగిరి సీట్లు ఇస్తే ఆ కాలేజీల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన లింబాద్రి మరో మూడు రోజుల్లో B క్యాటగిరి సీట్ల పై విధివిధానాలు ప్రకటిస్తామన్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..