Viral Video: చమ్మా.. చమ్మా అంటూ డ్యాన్స్ ఇరగదీసిన ఎయిర్ హోస్టెస్.. నెట్టింట్లో వైరల్ వీడియో
Uma Meenakshi: సోషల్ మీడియా సెన్సేషన్ ఉమా మీనాక్షి తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో మరోసారి తన ఆశ్చర్యపరిచింది. స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోన్న మీనాక్షికి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది.
Uma Meenakshi: సోషల్ మీడియా సెన్సేషన్ ఉమా మీనాక్షి తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో మరోసారి తన ఆశ్చర్యపరిచింది. స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోన్న మీనాక్షికి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 921k మంది ఫాలో అవుతున్నారు. ఇందుకు కారణం ఆమె పోస్ట్ చేసే డ్యాన్స్ వీడియోలే. ట్రెండింగ్‌లో ఉన్న పాటలకు తనదైన శైలిలో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేయడం, ఆ వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో రోజురోజుకీ ఆమె ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఆమె మరో డ్యాన్సింగ్ వీడియోతో మన ముందుకొచ్చింది. 1998 విడుదలైన చైనా గేట్‌లోని చమ్మా..చమ్మా అనే ఐకానిక్ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. ఒరిజినల్ పాటలో ఊర్మిళను అనుకరిస్తూ ఎంతో హుషారుగా కాలు కదిపింది.
నలుపు రంగు టాప్, ఆకుపచ్చ స్కర్ట్, వైట్ స్నీకర్ల ధరించి ఉమ చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఆమె డ్యాన్స్‌ను మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఆమె చాలా అందంగా ఉంది. డ్యాన్స్ అంతకుమించి ఉంది’, ‘ఎనర్జిటిక్ డ్యాన్స్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు లవ్, హార్ట్ ఎమోజీలు పెడుతున్నారు. కాగా గతంలోనూ పలుమార్లు ఖాళీ ఫ్లైట్‌లో ట్రెండింగ్ పాటలకు డ్యాన్స్ చేసింది మీనాక్షి. అవి కూడా క్షణాల్లోనే వైరల్‌గా మారాయి.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..