AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: నేరస్తుల పాలన ఎలా ఉంటుందో కళ్లారా చూస్తున్నాం.. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీటా పీక్స్ కు చేరుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వైసీపీ నేతల తీరుపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల సహాయంతో కుప్పంలో...

Chandrababu: నేరస్తుల పాలన ఎలా ఉంటుందో కళ్లారా చూస్తున్నాం.. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
Chandrababu Naidu
Ganesh Mudavath
|

Updated on: Aug 26, 2022 | 3:16 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీటా పీక్స్ కు చేరుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వైసీపీ నేతల తీరుపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల సహాయంతో కుప్పంలో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంపై వైసీపీ లీడర్స్ పగబట్టి, దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కుప్పంలో 650 ఇళ్లతో మోడల్‌ కాలనీ నిర్మించామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఆగిపోయిందని చెప్పారు. రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని ఆపేస్తున్నారని విమర్శించారు. కుప్పం చరిత్రలో నిన్న జరిగింది చీకటి రోజన్న చంద్రబాబు.. నేరస్తుల పాలన ఎలా ఉంటుందో కళ్లారా చూస్తున్నామని ద్వజమెత్తారు. కుప్పంపై వైసీపీ నేతలకు ఎందుకంత కోపమని ప్రశ్నించారు. పేదవాళ్ల ఆకలి కష్టాలు తీర్చాలని ఏర్పాటు చేసుకున్న అన్న క్యాంటీన్లను ఎందుకు ధ్వంసం చేస్తున్నారని నిలదీశారు. నిన్న జరిగిన అల్లర్ల కారణంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత పెంచారు. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 6+6 కమాండోలతో ఉన్న భద్రతను 12+12 కమాండోలకు పెంచింది. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు.

పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. సదుద్దేశంతో తీసుకువచ్చిన ఈ కార్యక్రమం తమిళనాడులో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్‌ ను సీఎం స్టాలిన్‌ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నేను పులివెందులను అభివృద్ధి చేసి, గండికోట నుంచి నీళ్లిచ్చాను. కానీ వైసీపీ పాలనలో మాత్రం కుప్పం పై రాజకీయంగా కక్ష గట్టారు. ఏ విధంగా నాశనం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో వచ్చి అభివృద్ధి చేయకుండా గడప గడపకు తిరుగుతూ కాలయాపన చేస్తున్నారు.

– చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్సీ భరత్‌ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.. అన్న క్యాంటీన్‌ వద్ద ఎందుకు ఏర్పాటు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇలా వ్యవహరించి ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి బయట తరిగే వాడా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..