Hyderabad Old City: పాతబస్తీలో హై-అలెర్ట్.. పోలీసుల నిఘాలో ఓల్డ్ సిటీ..
పాతబస్తీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. మక్కా మసీద్‌లో ప్రార్ధనలు ముగియడంతో రోడ్లపైకి పెద్ద ఎత్తున జనాలు పోటెత్తారు.

Makka Masjid
పాతబస్తీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. మక్కా మసీద్‌లో ప్రార్ధనలు ముగియడంతో రోడ్లపైకి పెద్ద ఎత్తున జనాలు పోటెత్తారు. దీనితో ఎక్కడా కూడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. చార్మినార్, మక్కా మసీద్, షాలీబండ తదితర ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అలాగే పాతబస్తీవ్యాప్తంగా 4వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం ప్రార్ధనలు ముగించుకుని.. ప్రశాంతంగా ఇంటికి వెళ్లాలని సూచించిన సంగతి తెలిసిందే.
