Telangana Politics: బీజేపీ రాష్ట్రాల్లో దాడులు ఎందుకు జరగడం లేదు? కేంద్రంపై మంత్రి హరీష్ ఫైర్..

Telangana Politics: కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఒక పథకం ప్రకారమే సీబీఐ దాడులు జరుగుతున్నాయని..

Telangana Politics: బీజేపీ రాష్ట్రాల్లో దాడులు ఎందుకు జరగడం లేదు? కేంద్రంపై మంత్రి హరీష్ ఫైర్..
Harish Rao
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 26, 2022 | 1:20 PM

Telangana Politics: కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఒక పథకం ప్రకారమే సీబీఐ దాడులు జరుగుతున్నాయని మంత్రి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పరిపాలనను పక్కన పెట్టి ప్రతి పక్షాలను వేధించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కేవలం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఈ దాడులు జరగడం లేదని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. కేవలం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే దాడులు జరుగడం వెనుక పెద్ద కుట్ర ఉందని, ఈ విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైపోయిందన్నారు. కవిత ఇంటిపై దాడి జరిగిందంటే అర్థమేంటి? అని ప్రశ్నించారు హరీష్ రావు. ప్రతిపక్షాలపై బురద జల్లే రాజకీయాలకు పాల్పడుతున్నారని కేంద్రం తీరుపై ఫైర్ అయ్యారు మంత్రి హరీష్.

‘కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వముంది. అక్కడ ఈడీ, సీబీఐ దాడులెందుకు జరగటం లేదు? ఏ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి దాడులు జరగడం లేదు. కవిత ఇంటి మీద దాడికి తెగబడ్డారు కారణమేంటి? బురద జల్లే రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు అర్ధమై పోయాయి. కర్ణాటక తరహాలో ఇక్కడా మత రాజకీయాలకు పాల్పడితే.. ఇక్కడి అభివృద్ధి కుంటు పడ్డం ఖాయం.’ అని అన్నారు మంత్రి హరీష్ రావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..