Andhra Pradesh: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్రంలో ఇక నుంచి ప్లాస్టిక్ బ్యానర్లు కనపడకూడదు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇక నుంచి ప్లాస్టిక్ బ్యానర్లు కనిపించకూడదని స్పష్టం చేశారు.

Andhra Pradesh: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్రంలో ఇక నుంచి ప్లాస్టిక్ బ్యానర్లు కనపడకూడదు.
Cm Jagan
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 26, 2022 | 1:00 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇక నుంచి ప్లాస్టిక్ బ్యానర్లు కనిపించకూడదని స్పష్టం చేశారు. క్లాత్‌తో తయారు చేసిన పోస్టర్లు మాత్ర కట్టాలన్నారు. విశాఖలో బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం సందర్భంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవాళ విశాఖలో నిర్వహించిన మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న సీఎం జగన్.. ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు ఇక్కడ నుంచే తొలి అడుగు వేస్తున్నామన్నారు. రేటు ఎక్కువైనా సరే క్లాత్‌తో చేసిన బ్యానర్లే కట్టాలన్నారు. తిరుమల ఇప్పటికే ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా మారింది. అక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం అమలు చేస్తామన్నారు. 2027నాటికి పూర్తిగా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్‌గా మారాలన్నారు సీఎం జగన్.

మెగా బీచ్ క్లీనింగ్ సక్సెస్.. కాగా, ఇవాళ విశాఖలో నిర్వహించిన మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం సక్సెస్ అయింది. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుమారు 21 వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. సుమారు 76 వేల టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తొలగించినట్టు ప్రకటించారు సీఎం జగన్.

ఇవి కూడా చదవండి

పార్లేతో ఒప్పదం.. ఇదిలాఉంటే.. పార్లే ఫర్‌ ది ఓషన్స్‌తో ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ కీలక ఒప్పందం చేసుకుంది. ఏపీలో సముద్ర తీరాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా మార్చేందుకు.. పార్లే ఫర్ ది ఓషన్స్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో 16 వేలకోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది పార్లే సంస్థ. దీని ద్వారా 20 వేల మందికి ఉపాధి లభించనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..