Visakhapatnam: గాజువాకలో 89 అడుగుల మహా గణపతి మట్టి విగ్రహం.. తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద..
ఈ ఏడాది జరగనున్న వినాయక చవితి వేడులకు నగరం ముస్తాబవుతోంది. దీనిలో భాగంగా విశాఖపట్నంలోని గాజువాకలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. వివరాల్లోకెళ్తే..
Kailasa Vishwaroopa Maha Ganapathi idol at Gajuwaka: ఈ ఏడాది జరగనున్న వినాయక చవితి వేడులకు నగరం ముస్తాబవుతోంది. దీనిలో భాగంగా విశాఖపట్నంలోని గాజువాకలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. నగరంలోని గాజువాకలోనున్న లంకా మైదానంలో ఏకంగా 89 అడుగుల ‘కైలాస విశ్వరూప మహా గణపతి’ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సన్నద్ధాలు చేస్తున్నారు. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే మూడు కన్నుల గణేశుడికి ఒక కన్ను శివుడు, మరో కన్ను పార్వతి దేవి రూపాలతో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. మరో విశిష్టత ఏమంటే..
35 కిలోల బారీ లడ్డూ గణేశుడికి సమర్పించనున్నారు. తాపేశ్వరంలోని ప్రసిద్ధ స్వీట్ షాప్ శ్రీ భక్త ఆంజనేయ సురుచి ఫుడ్స్ వారు మరోమారు అతి పెద్ద లడ్డును తయారు చేసి మహా గణపతికి సమర్పిస్తున్నారు. గతంలో వినాయక చవితికి వీరు సమర్పించిన లడ్డూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది కూడా. ఇక ఈ విగ్రహాన్ని ఖైరతాబాద్‌కు చెందిన శిల్పకారుడు చిన్నస్వామి రాజేంద్రన్ ఒడిశా, తమిళనాడుకు చెందిన కళాకారుల సహకారంతో తెల్ల మట్టి, వెదురు కర్రలతో తయారు చేస్తున్నారు. గాజువాక మహాగణపతితోపాటు.. దొండపర్తిలో 48 అడుగుల ఎత్తు గల మరో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని కోల్‌కతాకు చెందిన కళాకారుల బృంధం తయారు చేస్తోంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా వినాయక చవితి వేడుకలు జరుపుకోకపోవడంతో ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గాజువాక, దొండపర్తిలో అతి భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో గణేష్ విగ్రహం ఎత్తుపై ఎటువంటి పరిమితులు లేని విషయం తెలిసిందే.