Hyderabad: నగరవాసులకు అలెర్ట్‌.. నేడు ఈ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలివే

Traffic Restrictions: హైదరాబాద్‌ రన్నర్స్‌ మారథాన్‌ సందర్భంగా ఆదివారం హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గ‌చ్చిబౌలి స్టేడియం వ‌ర‌కు ఈ ట్రాఫిక్ ఆంక్షలు..

Hyderabad: నగరవాసులకు అలెర్ట్‌.. నేడు ఈ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలివే
Traffic Restrictions
Follow us
Basha Shek

|

Updated on: Aug 28, 2022 | 4:41 AM

Traffic Restrictions: హైదరాబాద్‌ రన్నర్స్‌ మారథాన్‌ సందర్భంగా ఆదివారం హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గ‌చ్చిబౌలి స్టేడియం వ‌ర‌కు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమ‌ల్లో ఉండ‌నున్నట్లు ఆయన పేర్కొన్నారు. మారథాన్‌ నెక్లె్‌స్‌ రోడ్‌ నుంచి ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, ఎంజే కాలేజ్‌, కేబీఆర్‌ పార్కు, జూబ్లీచెక్‌పోస్ట్‌, రోడ్‌నెంబర్‌ 45, కేబుల్‌ బ్రిడ్జిమీదుగా బాలయోగి స్టేడియం చేరుకుంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 4.30 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలుండనున్నాయి. ఆదివారం జేఈఈ, పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షలు జరుగుతుండడంతో ఆయా రూట్లలో ప్రయాణించే అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జాయింట్‌ సీపీ సూచించారు.

  • పంజాగుట్ట, రాజ్‌భ‌వ‌న్ నుంచి ఖైర‌తాబాద్ ఫ్లై ఓవ‌ర్, నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే వాహ‌న‌దారులు ఖైర‌తాబాద్ జంక్షన్‌, షాదాన్ కాలేజీ, నిరంకారి భ‌వ‌న్ నుంచి ర‌వీంద్ర భార‌తి మీదుగా వెళ్లాలి.
  • ఖైర‌తాబాద్ ఫ్లై ఓవ‌ర్, షాదాన్ కాలేజీ నుంచి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ వెళ్లే వాహ‌న‌దారులు తాజ్ కృష్ణ, రోడ్ నంబ‌ర్ 10, 12, క్యాన్సర్‌ హాస్పిట‌ల్ మీదుగా జూబ్లీహిల్స్ వెళ్లాలి.
  • ఇక్బాల్ మీనార్ నుంచి అప్పర్‌ ట్యాంక్ బండ్‌కు వ‌చ్చే వాహ‌నాల‌ను తెలుగు త‌ల్లి ఫ్లై ఓవ‌ర్ మీదుగా దారి మ‌ళ్లిస్తారు.
  • లిబ‌ర్టీ జంక్షన్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహ‌నాల‌ను అంబేద్కర్‌ విగ్రహం వ‌ద్ద దారి మ‌ళ్లిస్తారు. ఇక్బాల్‌ మీనార్ యూ ట‌ర్న్ నుంచి తెలుగు త‌ల్లి ఫ్లై ఓవ‌ర్ మీదుగా లోయ‌ర్ ట్యాంక్ బండ్, క‌ట్టమైస‌మ్మ దేవాలయం మీదుగా వాహ‌నాల‌ను అనుమ‌తిస్తారు.
  • క‌వాడిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి సెయిలింగ్ క్లబ్‌ వైపున‌కు వాహ‌నాల‌ను అనుమ‌తించ‌రు. మినిస్టర్‌ రోడ్డు నుంచి రాణిగంజ్ మ‌ధ్య కూడా వాహ‌నాల‌ను అనుమ‌తించ‌రు. నెక్లెస్ రోడ్డు వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను న‌ల్లగుట్ట జంక్షన్‌ వ‌ద్దనే మ‌ళ్లిస్తారు.
  • బేగంపేట నుంచి రాజ్‌భ‌వ‌న్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ కు వెళ్లే వాహ‌నాల‌ను గ్రీన్ ల్యాండ్స్ జంక్ష‌న్ నుంచి డీకే రోడ్ మీదుగా వాహ‌నాల‌కు అనుమ‌తిస్తారు. నాగార్జున స‌ర్కిల్ నుంచి కేబీఆర్ పార్క్ వ‌ర‌కు ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌నాల‌ను నిలిపివేస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు