Health Tips: తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళనతో సతమతం అవుతున్నారా? ఈ కీలక విషయాలు మీకోసమే..
Health Tips: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతం అవుతున్నారు. ఈ ఒత్తిడి కారణంగా అనేక అనారోగ్య సమస్యల భారిన కూడా పడుతున్నారు.
Health Tips: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతం అవుతున్నారు. ఈ ఒత్తిడి కారణంగా అనేక అనారోగ్య సమస్యల భారిన కూడా పడుతున్నారు. అయితే, ఒక వ్యక్తి ఆందోళనకు గురయ్యేందుకు వివిధ అంశాలు దోహదపడుతాయి. ఆందోళన, ఒత్తిడి ఎక్కువైతే.. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి రుగ్మతలకు(PTSD), అబ్సెసిస్-కంపల్సివ్ డిజార్డర్(OCD)కి దారి తీసే ప్రమాదం ఉంది. ఈ ఒత్తిడి, ఆందోళనకు వైద్యం అందుబాటులో ఉంది. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) ముఖ్యమైనదిగా పేర్కొంటారు వైద్యులు. మెడిసిన్స్ కూడా రిఫర్ చేస్తుంటారు. అయితే, వీటన్నిటికంటే.. సహజ నివారణలు కూడా ఆందోళన సమస్య నుంచి బయటపడేందుకు సహకరిస్తాయి. మీ ఆహారం, జీవనశైలిలో మార్పులు సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఆందోళన, ఒత్తిడిని అధిగమించడంలో సహాయపడే కొన్ని సహజ నివారణలు, కోపింగ్ చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం..
కెఫిన్ వినియోగం తగ్గించాలి:
కెఫిన్ అధికంగా తీసుకోవడం వలన కూడా అధిక ఒత్తిడి, చికాకు, భయాందోళన పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ కలిగిన పదార్థాలకంటే.. హెర్బల్ టీ లు, కెఫిన్ లేని డ్రింక్స్ తీసుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు.
మద్యం మానేయాలి:
కెఫిన్ డ్రింక్స్ మాదిరిగానే ఆల్కాహాల్ కూడా మానసిక ఒత్తిడి, ఆందోళనకు కారణమవుతుంది. అందుకే మద్యం అలవాటును మానుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆల్కాహాల్ సేవించినప్పుడు న్యూరోట్రాన్స్‌మిటర్ల అసమతుల్యతను ఏర్పడే అవకాశం ఉంది. అదికాస్తా మానసిక ఒత్తిడి, ఆందోళనకు కారణం అవుతుంది.
వ్యాయామం:
క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. వ్యాయామం, శారరీక శ్రమ రెండూ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వ్యాయాయం వల్ల.. మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఆందోళన కలిగించే వాటి నుంచి దృష్టిని మళ్లిస్తుంది. అయితే, ఇందుకోసం తీవ్రమైన వ్యాయామాలే చేయాల్సిన అవసరం లేదని, సాధారణ సాధనలు ఏవైనా ఓకేనని చెబుతున్నారు నిపుణులు.
మంచి నిద్ర:
శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. రాత్రి మంచిగా నిద్రపోయినప్పుడు అది తక్కువ అలసట, మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. దాంతోపాటు, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారాన్ని ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే ముందుగా సంబంధిత వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఇది సాధారణ సమస్యలకు మాత్రం ఉపకరిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..