Benefits of Brown Rice: డయాబెటిక్స్ బాధితులు బ్రౌన్ రైస్ నిత్యం తింటే ఎన్ని లాభాలో తెలుసా.. తినేముందు..

ముడి బియ్యం నుంచి మనకు లభించేవీ ఏవీ మ‌న‌కు అంద‌వు. అందుకే పాలిష్ చేయ‌ని బియ్యాన్ని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలావుంటే.. భారతదేశంలో అనేక రకాల బియ్యం కనిపిస్తాయి. వాటిని..

Benefits of Brown Rice: డయాబెటిక్స్ బాధితులు బ్రౌన్ రైస్ నిత్యం తింటే ఎన్ని లాభాలో తెలుసా.. తినేముందు..
Brown Rice
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 26, 2022 | 6:16 PM

భార‌తీయుల్లో దాదాపుగా 50 శాతం మందికి పైగా నిత్యం భోజ‌నంలో అన్నమే తింటారు. అయితే అన్నం తెల్లగా ముత్యాల్లా ఉంటే గాని చాలా మంది తిన‌రు. కానీ నిజానికి ముడి బియ్యాన్ని బాగా పాలిష్ చేయ‌డం వ‌ల్ల తెల్ల బియ్యంగా మారిపోతాయి. అయితే ముడి బియ్యాన్ని పాలిష్ చేస్తే దానిపై ఉండే పొర పోతుంది. అందులో ఉండే ముఖ్యమైన పోష‌కాలు కూడా ఎగిరిపోతాయి. ముడి బియ్యం నుంచి మనకు లభించేవీ ఏవీ మ‌న‌కు అంద‌వు. అందుకే పాలిష్ చేయ‌ని బియ్యాన్ని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలావుంటే.. భారతదేశంలో అనేక రకాల బియ్యం కనిపిస్తాయి. వాటిని ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో వినియోగిస్తారు. బియ్యంలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. మార్కెట్‌లో దొరికే వివిధ రకాల తెల్ల బియ్యం ఇప్పుడు బాగా పాలిష్ చేసిన తర్వాతే మార్కెట్లోకి వస్తున్నాయి. దాని వల్ల పోషకాలు మొత్తం లేకుండా నిస్సారమైన పిండి పదార్థం ఉన్న బియ్యం మాత్రమే మార్కెట్లోకి వస్తోంది.

అలాగే పాలిష్ చేసేటప్పుడు ఉపయోగించే రసాయనాలు మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. అయితే.. రోజూ బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల అనేక రకాల తీవ్రమైన వ్యాధులు తొలగిపోతాయి. క్యాన్సర్ లాగా, స్థూలకాయాన్ని తగ్గించడం, ఇది శరీరంలోని తీవ్రమైన నొప్పిని, మధుమేహాన్ని కూడా తొలగించడంలో సహాయపడుతుంది. అందువల్ల, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. ఈ రోజు నుంచి మీ వంటగదిలో వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ ఉపయోగించండి. ఇప్పుడు డైటీషియన్లు లేదా పోషకాహార నిపుణులు ఆహారంలో చేర్చుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. నిత్యం బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..

1. గుండెకు మంచిది

బ్రౌన్ రైస్ తినడం వల్ల గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. వైద్యులు కూడా బరువు పెరిగిన వారికి బ్రౌన్ రైస్ తినమని సూచిస్తున్నారు.

2. డ‌యాబెటిస్

పాలిష్ చేసిన బియ్యం గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. అంటే దాంతో వండిన అన్నాన్ని తింటే మ‌న శ‌రీరంలో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయి వెంటది వెంటనే పెరుగిపోతుంది. కానీ బ్రౌన్‌ రైస్‌లో గ్లైసీమిక్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉంటుంది. దీంతో వండిన అన్నాన్ని తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ స్థాయిలు వెంట‌నే పెర‌గ‌దు. అందువ‌ల్ల బ్రౌన్ రైస్ డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. అలాగే డ‌యాబెటిస్ లేని వారు కూడా బ్రౌన్ రైస్‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు  చాలా త‌గ్గుతావగా ఉంటంది. ఈరోజు నుంచి బ్రౌన్ రైస్‌ని ఆహారంలో చేర్చుకోండి. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. జీర్ణం కూడా చాలా సులభంగా అవుతుంది.  

3. కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది..

బ్రౌన్ రైస్ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది మాత్రమే కాదు, దీని ఈ బియ్యం వినియోగం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అలాగే దీని వినియోగం మొత్తం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

4. క్యాన్సర్‌

రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, నోటి క్యాన్సర్, దంత క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్‌లు ఉన్నవారు వీటిని తీసుకోవచ్చు. ఈ బ్రౌన్ రైస్‌లో ఐనాసిటాల్ హెగ్జాఫాస్ఫేట్ (IC6) అన‌బ‌డే స‌హ‌జ‌సిద్ధ‌మైన స‌మ్మేళ‌నం ఇందులో ఉంటుంది. డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వ‌క్షోజ‌, పేగుల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటుంది. బ్రౌన్ రైస్‌లో ఉండే పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల క‌ణాలు దెబ్బ తిన‌కుండా కాపాడుతాయి.

  (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం