AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువైన దుప్పట్లు, బొంతలు సులభంగా ఉతకడం ఎలా? ఈజీ హోమ్ క్లీనింగ్ టిప్స్‌ ఇవిగో..

శీతాకాలంలో ఎంత పెద్ద దుప్పట్లు, రంగులు ఉంటే అంత హాయిగా నిద్రపోతాం.. అందుకే అందరూ భారీ భారీ బొంతలు, కంఫర్ట్‌లు కొనుగోలు చేస్తుంటారు. ఇక, వాటిని ఉతకాలంటేనే దేవుడు కనిపిస్తాడు. ఒక్క బ్లంకెట్‌ ఉతకినా కూడా పై ప్రాణాలు పైకే పోతాయి. ప్రస్తుతం సీజన్‌ మారింది. చలి తగ్గిపోయింది. సమ్మర్ వచ్చేసింది. దీంతో ప్రజలు తమ భారీ దుప్పట్లను ప్యాక్ చేసి పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ సూపర్ ట్రిక్స్‌. డ్రై క్లీనింగ్ లేదు, వాషింగ్ మెషిన్ అవసరం లేదు. ఇంట్లో బరువైన దుప్పట్లను ఉతకడానికి సులభమైన మార్గం ఇది. తక్కువ శ్రమతో మీ దుప్పట్లను ప్రకాశవంతంగా సువాసన భరితంగా చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది.

బరువైన దుప్పట్లు, బొంతలు సులభంగా ఉతకడం ఎలా? ఈజీ హోమ్ క్లీనింగ్ టిప్స్‌ ఇవిగో..
Heavy Blankets Cleaning Tips
Jyothi Gadda
|

Updated on: Feb 21, 2026 | 8:47 AM

Share

శీతాకాలంలో ఎంత పెద్ద దుప్పట్లు, రంగులు ఉంటే అంత హాయిగా నిద్రపోతాం.. అందుకే అందరూ భారీ భారీ బొంతలు, కంఫర్ట్‌లు కొనుగోలు చేస్తుంటారు. ఇక, వాటిని ఉతకాలంటేనే దేవుడు కనిపిస్తాడు. ఒక్క బ్లంకెట్‌ ఉతకినా కూడా పై ప్రాణాలు పైకే పోతాయి. ప్రస్తుతం సీజన్‌ మారింది. చలి తగ్గిపోయింది. సమ్మర్ వచ్చేసింది. దీంతో ప్రజలు తమ భారీ దుప్పట్లను ప్యాక్ చేసి పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ సూపర్ ట్రిక్స్‌. డ్రై క్లీనింగ్ లేదు, వాషింగ్ మెషిన్ అవసరం లేదు. ఇంట్లో బరువైన దుప్పట్లను ఉతకడానికి సులభమైన మార్గం ఇది. తక్కువ శ్రమతో మీ దుప్పట్లను ప్రకాశవంతంగా సువాసన భరితంగా చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది.

శీతాకాలంలో మనల్ని వెచ్చగా ఉంచడానికి మనం బరువైన దుప్పట్లను ఉపయోగిస్తాము. కానీ, వేసవి రావటంతో వాటిని శుభ్రం చేసి భద్రపరచాల్సి వచ్చినప్పుడు, ఈ దుప్పట్లు పెద్ద సమస్యగా మారుతాయి. కొంతమంది తమ దుప్పట్లను నిల్వ చేసే ముందు డ్రై క్లీన్ చేస్తారు. లేదా మెషిన్ వాష్ చేస్తారు. ఇది ఖరీదైనది అవుతుంది. పైగా దుప్పట్ల నాణ్యతను దెబ్బతీస్తుంది. కాబట్టి,  మీరు దుప్పటిని ఉతికిన తర్వాత మాత్రమే నిల్వ చేయాలనుకుంటే ఈ ట్రిక్స్‌ మీ కోసమే.. ఈ పని మీకు సరసమైన ధరకు, తక్కువ శ్రమతో ఈజీగా చేసుకోవచ్చు.

బరువైన దుప్పట్లు వాష్‌ చేయడానికి ముందుగా ఒక పెద్ద బకెట్ లేదా టబ్‌లో నీటిని నింపి, లిక్విడ్‌ డిటర్జెంట్‌తో బాగా కలపండి. పొడి డిటర్జెంట్‌ను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది దుప్పట్లో చిన్న కణాలుగా ఇరుక్కుపోతుంది. అందులోనే వాషింగ్ పౌడర్‌తో పాటుగా మీకు నచ్చిన షాంపూ కూడా వేయండి. ఇప్పుడు, దుప్పటిని ఈ ద్రావణంలో పూర్తిగా నానబెట్టి కనీసం 2-3 గంటలు అలాగే ఉంచండి. అలా బాగా నానిన తరువాత బ్లాంకెట్స్‌ని బయటికి తీసి ఎక్కడైనా మరకలు లేదా దుమ్ము ఉంటే అక్కడ ఎక్కువగా బ్రష్‌తో రాయాల్సి ఉంటుంది.. లేదంటే ఓ సారి చేతులతో బాగా రబ్ చేయండి. చేతులతో రుద్దలేకపోతే కాళ్ళ కింద వేసి బాగా తొక్కినా కూడా అందులోని మరకలు, దుమ్మంతా బయటికి వెళ్లిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు, ఆ మురికి నీరంతా కింద పారబోసుకోండి.. టబ్‌లో మంచి నీరు పోస్తూ, లేదంటే, ట్యాప్‌ వాటర్‌ కిద టబ్‌ని ఉంచండి. రన్నింగ్‌ వాటర్‌లో ఉతికిన బ్లాంకెట్స్‌ని ముంచుతూ బయటికి తీయండి. ఇలా ఎన్నిసార్లు వీలైతే అన్నీసార్లు తీస్తూ.. మురికి మొత్తం పోయిందని తెలిసి, నీరంతా చక్కగా వచ్చేవవరకూ నీటిలో నుంచి ఒకటికి రెండు సార్లు తీయండి. తర్వాత కొద్దికొద్దిగా బ్లాంకెట్స్‌ని తీస్తూ రంద్రాలు కలిగిన చైర్‌పై వేసుకోండి. ఒక గంట, అరగంట పాటు అలాగే, వదిలేశారంటే..అందులోని నీరంతా పోతుంది. ఇప్పుడు ఈజీగా దాన్ని మోయగలుగుతారు. కాబట్టి, ఎండలో వైర్‌పై ఆరబెట్టుకోండి. ఇలా వారానికోసారి చేశారంటే, ఈజీగానే బ్లాంకెట్స్‌ని ఉతకొచ్చు. ఇది బ్లాంకెట్స్ మాత్రమే కాదు. స్వెటర్స్ బరువున్న బొంతలు, బట్టల్ని ఉతకడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది.

హాస్టల్‌లో ఉంటున్నవారికి, ఇలాంటి బరువైన దుప్పట్లను ఉతకడానికి టైమ్‌ దొరకనంత బిజీగా ఉన్నవారికి వాటిని శుభ్రం చేయడానికి కూడా కొన్ని సింపుల్‌ టిప్స్‌ ఉన్నాయి. ఇందుకోసం ముందుగా మంచం మీద దుప్పటిని సరిగ్గా పరచండి. ఇప్పుడు ఒక బాటిల్ నీటిలో 4-5 చెంచాల టాల్కమ్ పౌడర్, కొద్దిగా వైట్ వెనిగర్ వేసి చిక్కటి మిశ్రమాన్ని తయారు చేయండి. తరువాత, మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి, దుప్పటికి రెండు వైపులా పూర్తిగా స్ప్రే చేయండి. దుప్పటిని 15-20 నిమిషాలు ఎండలో ఉంచండి. చివరగా, మృదువైన కార్పెట్ బ్రష్‌తో దుప్పటిని బ్రష్ చేయండి. ఇది తేలికపాటి మరకలను తొలగిస్తుంది. మీ దుప్పటిని తాజాగా, బ్యాక్టీరియా రహితంగా సువాసన భరితంగా మారుస్తుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us