AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : సెన్సార్ రిజెక్ట్ చేసింది.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఒక సినిమా చిత్రం నిర్మాణ ప్రస్థానం ఎన్నో మలుపులు తిరిగిందని దాని నిర్మాతలు జె. పుల్లా రావు, జె. భగవాన్ వెల్లడించారు. ఈవీవీ సత్యనారాయణ దార్శనికతతో రూపొందిన ఈ చిత్రం, అప్పట్లో వినూత్నమైన "ఆడవాళ్ళు మగవాళ్ళలా, మగవాళ్ళు ఆడవాళ్ళలా" అనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకీ ఆ సినిమా విడుదల వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందామా.

Tollywood : సెన్సార్ రిజెక్ట్ చేసింది.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..
Jambalakidi Pamba
Rajitha Chanti
|

Updated on: Jun 08, 2026 | 8:14 AM

Share

తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరగని రికార్డు క్రియేట్ చేసుకున్న కామెడీ క్లాసిక్ చిత్రం “జంబలకిడి పంబ”. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఆ సినిమా నిర్మాణ వెనుక అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. నిర్మాతలు జె. పుల్లా రావు, జె. భగవాన్, స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్యతో కలిసి ఈ సాహసోపేతమైన చిత్రాన్ని నిర్మించారు. “ఆడవాళ్ళు మగవాళ్ళలా, మగవాళ్ళు ఆడవాళ్ళలా” అనే వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రస్థానాన్ని వారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నిర్మాతల కథనం ప్రకారం, ఈవీవీ సత్యనారాయణ ఈ కాన్సెప్ట్‌ను చాలా కాలంగా తన దగ్గర పెట్టుకున్నారు. జంధ్యాల దగ్గర పనిచేసిన సమయంలో, ఈవీవీ “మొగుడు పెళ్ళాల” సినిమా టైటిల్స్‌లో ఈ “లింగ మార్పిడి” నేపథ్యాన్ని ఉపయోగించి మంచి స్పందన పొందారు. ఇదే ఆయనకు “జంబలకిడి పంబ” పూర్తి కథను తెరకెక్కించడానికి ప్రేరణగా నిలిచింది. అయితే, కథా చర్చల సమయంలో, ఈ ప్రత్యేకమైన పాయింట్ నేరుగా చెప్పడం వల్ల కథ ముందుకు సాగక ఒక దశలో ఆగిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

ఈ సమయంలోనే రచయిత దివాకర్ బాబు రంగప్రవేశం చేశారు. ఆయన, కథను ముందు సాధారణంగా ప్రారంభించి, ఆ తర్వాత ఒక మందు ప్రభావంతో పాత్రలను మార్చాలనే అద్భుతమైన స్క్రీన్ ప్లేను అందించారు. అంతేకాదు, అప్పటిదాకా ఉన్న ఫస్ట్ హాఫ్‌ను సెకండ్ హాఫ్‌గా మార్చి, కొత్తగా ఫస్ట్ హాఫ్‌ను రాయించారు. దివాకర్ బాబు అందించిన ఈ స్క్రీన్ ప్లే, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. “జంబలకిడి పంబ” అనే వినూత్నమైన టైటిల్‌ను కూడా దివాకర్ బాబే సూచించారు. వాస్తవానికి, ఈవీవీ ఈ సినిమాకు ముందు “రివర్స్ గేర్” అనే టైటిల్‌ను అనుకున్నారు, కానీ స్నేహితుల సలహా మేరకు ఆ టైటిల్‌ను మార్చారు. ఈవీవీ ఎటువంటి మొహమాటం లేకుండా మంచి సలహాలను స్వీకరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని నిర్మాతలు పేర్కొన్నారు. సినిమా తొలి కాపీ సిద్ధమయ్యాక, పలువురు ప్రివ్యూ చూసినవారు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కష్టమని, ప్రేక్షకులు స్వీకరించరని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతేకాదు, సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాపై అభ్యంతరాలు చెప్పింది. దీంతో నిర్మాతలు రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. అప్పటి చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి సినిమాను చూసి, “సినిమా చాలా బాగుంది, బయట చెప్పినట్లుగా ఏమీ లేదు” అని ప్రశంసించి, క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

ఈవీవీ సత్యనారాయణ, నిర్మాతలకు తోడుగా తన భార్య సరస్వతి కుమారి పేరు మీద పార్ట్‌నర్‌గా జతకలిశారు. హీరో నరేష్‌ను ఈ సినిమాకు ఎంపిక చేసుకోవడం వెనుక కూడా ఒక ఆసక్తికర కారణం ఉంది. జంధ్యాల దగ్గర పనిచేసిన అనుభవం ఉండటంతో, నరేష్‌తో నిర్మాతలు, ఈవీవీకి మంచి అనుబంధం ఉండేది. మొదటి నుండి నరేష్‌తోనే ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. “జంబలకిడి పంబ” విజయం నరేష్ కెరీర్‌కు ఒక మలుపు అని, అంతకు ముందు రాజేంద్ర ప్రసాద్‌తో కామెడీ సినిమాల్లో ఉండే పోటీలో నరేష్ కు ఈ సినిమాతో వాణిజ్యపరంగా మరింత పట్టు లభించిందని నిర్మాతలు గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా అద్భుత విజయం సాధించి, తెలుగు సినిమా చరిత్రలో ఒక విచిత్రమైన, విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..

Follow Us