OTT Movie : 6 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్.. క్షణక్షణం ఉత్కంఠ.. ఊహించని మలుపులు.. ఓటీటీలో దుమ్మురేపుతుంది..
ప్రస్తుతం ఓటీటీలో ఓ వెబ్ సిరీస్ దుమ్మురేపుతుంది. 2026 జూన్ 3 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చిన ఓ సిరీస్ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కేవలం కొద్ది రోజుల్లోనే అడియన్స్ మనసులను గెలుచుకుంది. ఈ వెబ్ సిరీస్‌లో నసీరుద్దీన్ షా, జిమ్ సర్భ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సిరీస్ నిజ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది.

ప్రతి వారం ఓటీటీలోకి కొత్త కొత్త కంటెంట్ వెబ్ సిరీస్, సినిమాలు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కానీ మీరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అవే బోరింగ్ క్రైమ్ థ్రిల్లర్‌లు, రొమాంటిక్ కామెడీ సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు చూసి విసిగిపోయి.. ఏదైనా ఇంట్రెస్టింగ్ సిరీస్ చూడాలనుకుంటున్నారా.. ? అయితే ఈ వెబ్ సిరీస్‌ను మీ ‘తప్పక చూడాల్సిన’ జాబితాలో తప్పకుండా చేర్చుకోవచ్చు. భారతదేశంలోని మొట్టమొదటి స్టార్టప్‌లలో ఒకటైన ఈ బ్రాండ్ కథను చెప్పే ఈ శక్తివంతమైన సిరీస్, ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ కథ ఎంత ఆకట్టుకునేలా ఉందంటే, విడుదలైన వెంటనే ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఈ సిరీస్‌కు IMDbలో 10కి 8.8 మంచి రేటింగ్ లభించింది. ఈ వెబ్ సిరీస్‌లో ప్రముఖ నటులు నసీరుద్దీన్ షా , జిమ్ సర్భ్ ప్రధాన పాత్రలలో నటించారు. చేతి గడియారం కొనాలనే ప్రశ్న వచ్చినప్పుడల్లా, అందరికీ టైటాన్ పేరే గుర్తొస్తుంది. కానీ ఈ టైటాన్ ఎలా ఆవిర్భవించింది, భారతదేశంలోనే అతిపెద్ద బ్రాండ్‌గా ఎలా ఎదిగింది, ఇంత ప్రజాదరణ ఎలా పొందింది అనే కథను ఈ వెబ్ సిరీస్ చెబుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..
టైటాన్‌ను మన ముంగిటకు తీసుకువచ్చిన వ్యక్తి కథే ‘మేడ్ ఇన్ ఇండియా: ది టైటాన్ స్టోరీ’. ఇది 1980లలో జె.ఆర్.డి. టాటా మద్దతుతో, భారతదేశపు మొట్టమొదటి ప్రపంచ స్థాయి స్వదేశీ వాచ్ బ్రాండ్‌ను సున్నా నుండి నిర్మించిన పారిశ్రామికవేత్త జెర్క్సెస్ దేశాయ్ సాహసోపేతమైన ప్రయాణాన్ని చిత్రీకరిస్తుంది. ఒక స్విస్ వాచ్ తయారీదారుడి చేతిలో జెఆర్‌డి టాటా అవమానకరమైన అనుభవాన్ని ఎదుర్కోవడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఆయన, టాటా కంపెనీలో చాలా ప్రతిభావంతుడైన, ఆశయాలున్న ఎగ్జిక్యూటివ్ అయిన జెర్క్సెస్ దేశాయ్‌కి స్వదేశీ వాచీల తయారీ బాధ్యతను అప్పగిస్తారు. ఈ వెబ్ సిరీస్‌లో, నసీరుద్దీన్ షా జెఆర్‌డి టాటా పాత్రను, జిమ్ సర్భాన్ జెర్క్సెస్ దేశాయ్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సిరీస్ జూన్ 3 నుండి MX ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..
కథ విషయానికి వస్తే.. వినయ్ కామత్ రాసిన ‘Titan: Inside India’s Most Successful Consumer Brand’ అనే పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. 1970వ దశకంలో విదేశీ వాచ్‌ల అక్రమ రవాణా ఎక్కువగా ఉన్న సమయంలో, ఒక భారతీయ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి జెర్క్స్ దేశాయ్ (Xerxes Desai) చేసిన కృషిని ఇది చూపిస్తుంది. JRD టాటా ఒక విదేశీ వాచ్ తయారీదారుడి చేతిలో అవమానానికి గురవ్వడం, దానికి బదులుగా భారత్ లోనే అత్యుత్తమ గడియారాలను తయారు చేయాలని సంకల్పించడం ఈ కథలో ప్రధాన ఘట్టం.
ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..
ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..
