AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 22 ఏళ్లకే పెళ్లి.. కట్‌చేస్తే.. ఇప్పుడు తన రేంజ్ మారిందంటూ విడాకులు..

Rahul Chahar Instagram Emotional Post: టీమిండియా, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ టీం ప్లేయర్ రాహుల్ చాహర్ ప్రస్తుతం ఓ సోషల్ మీడియా పోస్ట్‌తో హాట్ టాపిక్‌గా మారాడు. తన 4 ఏళ్ల పెళ్లి బంధానికి స్వస్తి చెప్పినట్లు పేర్కొన్నాడు.

Team India: 22 ఏళ్లకే పెళ్లి.. కట్‌చేస్తే.. ఇప్పుడు తన రేంజ్ మారిందంటూ విడాకులు..
Rahul Chahar
Venkata Chari
|

Updated on: Feb 21, 2026 | 9:00 AM

Share

Rahul Chahar Divorce: భారత క్రికెట్‌లో గత కొన్నేళ్లుగా విడాకుల వార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. 2026లో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. అలాగే స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో మరో భారత క్రికెటర్ పేరు చేరింది. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత తన భార్యతో విడిపోయినట్లు సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ ద్వారా ప్రకటించాడు. ఈ వార్త అభిమానులను షాక్‌కు గురి చేసింది.

లిస్ట్ లో చేరిన భారత యువ లెగ్ స్పిన్నర్..

హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చహల్ తర్వాత భారత యువ లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ (Rahul Chahar) కూడా తన వివాహ జీవితానికి ముగింపు పలికినట్లు వెల్లడించాడు. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేశాడు.

“మేం చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం. అప్పటికి మా జీవితాల విలువ, బాధ్యతలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం. ఆ తర్వాత ఊహించని పాఠాలను నేర్చుకోవాల్సి వచ్చింది” అంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.

అంతేకాకుండా గత 15 నెలలుగా కోర్టు చుట్టూ తిరగడం, సహనం, అనుకూలంగా మారడం, నిజాన్ని అంగీకరించే ధైర్యం నేర్చుకున్నానని పేర్కొన్నాడు. సరైన న్యాయ ప్రక్రియ అనంతరం విడాకుల వ్యవహారం ముగిసిందని, దీనికి తాను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. “ఈ అధ్యాయాన్ని కోపం లేదా పశ్చాత్తాపంతో కాకుండా స్పష్టతతో ముగిస్తున్నాను” అని తన భావాలను వెల్లడించాడు.

2022లో పెళ్లి..

View this post on Instagram

A post shared by Rahul Chahar (@rdchahar1)

రాహుల్ చహర్ 2022 మార్చి 9న గోవాలో ఈషానీ జౌహర్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అప్పట్లో భారత ఆల్‌రౌండర్ దీపక్ చహర్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యాడు. అప్పట్లో ఈ పెళ్లి క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

పెళ్లి సమయంలో రాహుల్ చహర్ ఐపీఎల్‌లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం స్థిర స్థానం కోసం పోరాడుతున్న దశలో ఉన్నాడు. అప్పటికి అతడి వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే. వచ్చే నెలలో వీరి పెళ్లికి నాలుగేళ్లు పూర్తయ్యేవి. అయితే ఆలోపే ఇరువురు తమ బంధానికి ముగింపు పలికారు.

రాహుల్ చహర్ కెరీర్ గణాంకాలు..

రాహుల్ చహర్ 2019 ఆగస్టు 6న వెస్టిండీస్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత తరపున అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 6 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు సాధించాడు. ఈ సమయంలో అతడి ఎకానమీ రేటు 7.59గా ఉంది.

2021లో శ్రీలంకతో ఆడిన ఏకైక వన్డేలో 3 వికెట్లు తీశాడు. 2021 నవంబర్ 8న భారత్ జెర్సీలో చివరిసారిగా కనిపించాడు. ఐపీఎల్ 2026లో రాహుల్ చహర్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆరు గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని సంపద, ఏది అనుకుంటే..
ఆరు గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని సంపద, ఏది అనుకుంటే..
ఆ ఒక్క కారణంతో 15 సినిమాలు నాకు రాలేదు..
ఆ ఒక్క కారణంతో 15 సినిమాలు నాకు రాలేదు..
పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..
పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..
టీ20 ప్రపంచకప్ 2026లోనే తోపు ఈ ఓపెనర్.. ఒక్కసారి కూడా ఔట్ కాలే..
టీ20 ప్రపంచకప్ 2026లోనే తోపు ఈ ఓపెనర్.. ఒక్కసారి కూడా ఔట్ కాలే..
బరువైన దుప్పట్లు సులభంగా ఉతకడం ఎలా? ఈజీ హోమ్ క్లీనింగ్ టిప్స్‌
బరువైన దుప్పట్లు సులభంగా ఉతకడం ఎలా? ఈజీ హోమ్ క్లీనింగ్ టిప్స్‌
మమ్మల్ని తక్కువగా చూడొద్దు.! జింబాబ్వే గట్టి వార్నింగ్
మమ్మల్ని తక్కువగా చూడొద్దు.! జింబాబ్వే గట్టి వార్నింగ్
4 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు చెప్పిన టీమిండియా ప్లేయర్..
4 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు చెప్పిన టీమిండియా ప్లేయర్..
టొమాటో దోసె.. 5 నిముషాల్లో ఇలా చేసేయండి.. రుచి అదిరిపోతోంది!
టొమాటో దోసె.. 5 నిముషాల్లో ఇలా చేసేయండి.. రుచి అదిరిపోతోంది!
అరటి కాయలతో అదిరిపోయే లాభాలు.. తెలిస్తే తొక్కను కూడా వేస్ట్ చేయరు
అరటి కాయలతో అదిరిపోయే లాభాలు.. తెలిస్తే తొక్కను కూడా వేస్ట్ చేయరు
ఆరోగ్యానికి మంచివే.. అతిగా తింటే మాత్రం ఆ సమస్యలు తప్పవు
ఆరోగ్యానికి మంచివే.. అతిగా తింటే మాత్రం ఆ సమస్యలు తప్పవు