Actor Madhunandan : ఆ ఒక్క కారణంతో 15 సినిమాలు నాకు రాలేదు.. నటుడు మధునందన్..
నటుడు మధునందన్ తెలుగులో మంచి పాపులారిటి ఉన్న నటుడు. గుండె జారి గల్లంతయ్యిందే, ఇష్క్ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన మధునందన్.. కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో అంత యాక్టివ్ గా ఉండడం లేదు. ఇందుకు గల కారణాలను వివరించారు.

నటుడు మధునందన్ ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతడు సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంలో ఎదురైన ఒడిదుడుకులు, వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. తన కెరీర్‌లో 15 నుంచి 20 సినిమాలు కోల్పోవడానికి గల ప్రధాన కారణాలను ఆయన వివరించారు. నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్ రంగ, లై చిత్రాల షూటింగ్ నిమిత్తం సుమారు ఆరు నెలల పాటు అమెరికాలో ఉండాల్సి రావడం, ఆ సమయంలో తానూ అందుబాటులో లేనని ఇండస్ట్రీలో భావించడం ఒక కారణమని అన్నారు. అంతేకాకుండా, తాను ఇంకా ఉద్యోగం చేస్తూ సినిమాలు చేస్తున్నానని, అందువల్ల కాల్ షీట్స్ ఇవ్వలేడని చాలా మందిలో అపోహ ఏర్పడిందని మధునందన్ తెలిపారు. ఉద్యోగం ఎప్పుడో వదిలేసినప్పటికీ, ఈ విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదని, అది తన తప్పు కాదని అన్నారు. ఈ అపోహల వల్ల తనను సంప్రదించడానికి ప్రయత్నించిన డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, అసోసియేట్‌లు, మేనేజర్‌లు వంటి వారు ఇతర నటుల వైపు వెళ్లారని మధునందన్ వివరించారు. ఆ ఆరు నెలల కాలం తన కెరీర్‌కు కొంత కష్టాంగా గడిచిందని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
తన కెరీర్‌కు నితిన్ ఎంతో ఉపయోగపడ్డారని మధునందన్ స్పష్టం చేశారు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు తనకు గొప్ప గుర్తింపును, అవకాశాలను తెచ్చాయని, అందుకే నితిన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. అయితే, నితిన్‌తో కలిసి వరుసగా సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీలో “నితిన్ మనిషి” అనే ఒక ముద్ర ఏర్పడిందని మధునందన్ పేర్కొన్నారు. తనతోనే సినిమాలు చేస్తాడనే ఈ అపోహ వల్ల కొన్ని మంచి పాత్రలను కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో వ్యక్తిగత సంబంధాలు తక్కువ కాబట్టి, తెరపై కనిపించిన దాని ఆధారంగానే అభిప్రాయాలు (పర్సెప్షన్స్) ఏర్పడతాయని, ఇది కెరీర్‌పై ప్రభావం చూపుతుందని వివరించారు. అయినప్పటికీ, నితిన్‌తో తన సంబంధంలో ఎటువంటి తేడాలు లేవని, తమ స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని ధృవీకరించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తాను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతానని, ఇండస్ట్రీలో “స్పైస్” కంటే శాంతిని కోరుకుంటానని మధునందన్ చెప్పారు. స్నేహాల విషయంలో తాను సులభంగా మోసపోతానని, గుడ్డిగా అందరినీ నమ్ముతానని, దీనివల్ల తన క్యారెక్టర్లు, డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని మధునందన్ తెలిపారు. భావోద్వేగంగా ఉండటం వల్లే తాను స్నేహాలలో మోసపోతున్నానని, అనుమానంతో సంబంధాలను ప్రారంభించడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..
