AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: ఓటీటీలోకి వచ్చిన రూ.1331 కోట్ల సినిమా.. ఐఫోన్‏తో షూటింగ్.. వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్..

ఓటీటీలోకి నిత్యం కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ వస్తుంది. అందుకే ఈ జానర్ చిత్రాలు ఎక్కువగా విడుదలవుతున్నాయి. వైరస్, హారర్ నేపథ్యంలో వచ్చిన ఓ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా గురించి తెలుసుకుందామా.

Cinema OTT: ఓటీటీలోకి వచ్చిన రూ.1331 కోట్ల సినిమా.. ఐఫోన్‏తో షూటింగ్.. వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్..
28 Years Later The Bone Temple
Rajitha Chanti
|

Updated on: Feb 21, 2026 | 8:02 AM

Share

హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వెన్నులో భయం పుట్టించే విజువల్స్, స్టోరీ, బీజీఎమ్ ఉన్నప్పటికీ ఈ సినిమాలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఎక్కువగా ఈ జానర్ చిత్రాలే విడుదలవుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. వణుకుపుట్టించే సీన్లతో..భయపెట్టే సన్నివేశాలతో సాగే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అభిమానులకు మంచి ఫీస్ట్ లాంటింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా పేరు ‘28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్’. ఇది అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

అటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ‏థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అమెరికన్ హారర్ థ్రిల్లర్ ‘28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్’ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో 151.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా రూ.1331 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ఇప్పటికే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇప్పుడు విడుదలైన మూవీ మూడో పార్ట్. ఇది 28 డేస్ లేటర్ ఫిల్మ్ సిరీస్ లో ఓ పార్ట్. అంతకు ముందు 2002లో 28 డేస్ లేటర్, 2007లో 28 వీక్స్ లేటర్ చిత్రాలను రూపొందించారు. ఈ హారర్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us