AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : తెలుగులో లవర్ బాయ్.. స్టూడెంట్‏ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్స్ అంటే గుర్తొచ్చే హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో ఈ హీరో ఒకరు. ఒకప్పుడు ఎన్నో ప్రేమకథ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన ఈ హీరో.. ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Tollywood : తెలుగులో లవర్ బాయ్.. స్టూడెంట్‏ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
R Madhavan
Rajitha Chanti
|

Updated on: Feb 21, 2026 | 7:45 AM

Share

సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు. సౌత్ ఇండస్ట్రీలో అతడు లవర్ బాయ్. ఎన్నో ప్రేమకథ చిత్రాలతో తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ సినీరంగంలోకి రాకముందు అతడు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఓ విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. చివరకు ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొని తమ ప్రేమని విజయవంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన హిందీలో ఎక్కువగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ హీరో ప్రేమ కథ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? తనే హీరో మాధవన్. తెలుగు, తమిళంలో ఎన్నో ప్రేమ కథలతో భారీ విజయాలను అందుకున్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

2000లో వచ్చిన అలైపాయుతే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు మాధవన్. అప్పట్లో తన చాక్లెట్ బాయ్ లుక్స్, సహజ నటనతో కట్టిపడేశాడు. ముఖ్యంగా అమ్మాయిలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా మాధవన్ కెరీర్ మార్చిన సినిమా మిన్నలే. ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో అతడి క్రేజ్ మారిపోయింది. నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ అయ్యాడు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అయిన ధురంధర్ సినిమాతో మరో హిట్టు అందుకున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ రూ.1300 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ వసూళ్లు రాబడుతూనే ఉంది. సినీరంగంలోకి అడుగుపెట్టకముందు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. విద్యార్థులకు స్కిల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేవాడు. అదే సమయంలో స్టూడెంట్ సరితా బిర్జేని కలిశాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. కోర్సు అనంతరం ఆమె విమాన ఎయిర్ హోస్టెస్ గా ఎంపికైంది. వీరిద్దరు 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు. అతడు మల్టీ టాలెంటెడ్.

View this post on Instagram

A post shared by R. Madhavan (@actormaddy)

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us
స్టూడెంట్‏ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..
స్టూడెంట్‏ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..
NZ vs PAK: ఆ బలహీనతలే పాక్ కొంప ముంచనున్నాయా?
NZ vs PAK: ఆ బలహీనతలే పాక్ కొంప ముంచనున్నాయా?
ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ వంటగదిలోని ఈ పదార్థం గుండెకు ఆల్కహాల్ కంటే డేంజర్..
మీ వంటగదిలోని ఈ పదార్థం గుండెకు ఆల్కహాల్ కంటే డేంజర్..
విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి ! వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి ! వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
ఆదిమానవుల ఎగ్ కర్రీ.. నిప్పులపై ఇలా చేస్తే అదిరిపోతోంది
ఆదిమానవుల ఎగ్ కర్రీ.. నిప్పులపై ఇలా చేస్తే అదిరిపోతోంది
కాటేరమ్మ కొడుకు ఔట్.. బ్యాడ్ లక్కోడికి లక్కీ ఛాన్స్..?
కాటేరమ్మ కొడుకు ఔట్.. బ్యాడ్ లక్కోడికి లక్కీ ఛాన్స్..?
ఫైసా ఖర్చులే.. ఈ సీక్రెట్‌ ఫేస్‌ ప్యాక్‌తో అదిరిపోయే అందం మీసొంతం
ఫైసా ఖర్చులే.. ఈ సీక్రెట్‌ ఫేస్‌ ప్యాక్‌తో అదిరిపోయే అందం మీసొంతం
బంగారం ధరలు యూటర్న్‌! ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్..
బంగారం ధరలు యూటర్న్‌! ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్..
సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే
సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే