AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..

మధ్యతరగతి ప్రజలకు పోస్టాఫీస్ పథకాలు ఒక నమ్మకమైన కొండంత అండగా నిలుస్తున్నాయి. రూపాయి కూడా నష్టం లేకుండా గ్యారెంటీ రిటర్న్స్ కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన ఆప్షన్. ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం.. కేవలం రూ.11,111 నెలవారీ పొదుపుతో మీరు 5 ఏళ్లలో దాదాపు 8 లక్షల భారీ నిధిని ఎలా సమకూర్చుకోవచ్చు అనేది తెలుసుకుందాం..

Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..
Post Office Rd Scheme
Krishna S
|

Updated on: Feb 21, 2026 | 8:39 AM

Share

నేటి కాలంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడి మార్గాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని భావించే వారికి.. పోస్ట్ ఆఫీస్ అందించే పథకాలు ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, వేతన జీవులు తమ భవిష్యత్తు అవసరాల కోసం ఎటువంటి రిస్క్ లేకుండా క్రమపద్ధతిలో డబ్బును దాచుకోవడానికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన వేదిక. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని సేవ్ చేయడం వల్ల మెచ్యూరిటీ తర్వాత భారీ మొత్తం చేతికి వస్తుంది. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభదాయకమైన రాబడిని ఎలా పొందవచ్చో ఒకసారి పరిశీలిద్దాం.

5 ఏళ్ల ప్లాన్.. స్థిరమైన ఆదాయం

పోస్ట్ ఆఫీస్ RD కాలపరిమితి 5 సంవత్సరాలు . ఫిబ్రవరి 2026 నాటికి ప్రభుత్వం ఈ పథకంపై 6.7శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి అకౌంట్‌లో పడుతుంది. దీనివల్ల పెట్టుబడిదారులకు చక్రవడ్డీ లాభం చేకూరుతుంది.

రూ.11,111 డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది?

ఒకవేళ మీరు ప్రతి నెలా రూ.11,111 అంటే రోజుకు రూ.370 చొప్పున ఈ పథకంలో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి ఎంత చేతికి వస్తుందంటే..?

  • నెలవారీ డిపాజిట్: రూ.11,111
  • మొత్తం పెట్టుబడి కాలం: 5 ఏళ్లు (60 నెలలు)
  • మీరు జమ చేసే మొత్తం: రూ.6,66,660
  • వడ్డీ రేటు: 6.7శాతం
  • మొత్తం వడ్డీ ఆదాయం: రూ.1,26,285.72
  • మెచ్యూరిటీ మొత్తం : 7,92,945.72

అంటే 5 ఏళ్ల తర్వాత మీ చేతికి దాదాపు రూ.7.93 లక్షలు అందుతాయి. మీ పిల్లల ఉన్నత చదువులకు లేదా భవిష్యత్తు అవసరాలకు ఇది ఒక మంచి నిధిగా మారుతుంది.

ఈ పథకం ప్రత్యేకతలు ఏంటి..?

కేవలం రూ.100తో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. 12 వాయిదాలు సక్రమంగా చెల్లించిన తర్వాత, ఖాతాలో ఉన్న మొత్తంలో 50% వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఖాతా తెరిచిన 3 ఏళ్ల తర్వాత అవసరమైతే ఖాతాను క్లోజ్ చేయొచ్చు. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది.

ఎవరికి ఇది సరైన ఎంపిక?

స్థిరమైన జీతం వచ్చే ఉద్యోగులు, చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకునే గృహిణులు, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని సీనియర్ సిటిజన్లకు ఈ RD పథకం బెస్ట్ ఆప్షన్. మీరు కూడా ఈ పథకంలో చేరాలనుకుంటే మీకు సమీపంలోని పోస్టాఫీసును సందర్శించి ఆధార్, పాన్ కార్డు, ఫోటోలతో సులభంగా ఖాతాను ప్రారంభించవచ్చు.

Follow Us
పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..
పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..
టీ20 ప్రపంచకప్ 2026లోనే తోపు ఈ ఓపెనర్.. ఒక్కసారి కూడా ఔట్ కాలే..
టీ20 ప్రపంచకప్ 2026లోనే తోపు ఈ ఓపెనర్.. ఒక్కసారి కూడా ఔట్ కాలే..
బరువైన దుప్పట్లు సులభంగా ఉతకడం ఎలా? ఈజీ హోమ్ క్లీనింగ్ టిప్స్‌
బరువైన దుప్పట్లు సులభంగా ఉతకడం ఎలా? ఈజీ హోమ్ క్లీనింగ్ టిప్స్‌
మమ్మల్ని తక్కువగా చూడొద్దు.! జింబాబ్వే గట్టి వార్నింగ్
మమ్మల్ని తక్కువగా చూడొద్దు.! జింబాబ్వే గట్టి వార్నింగ్
4 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు చెప్పిన టీమిండియా ప్లేయర్..
4 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు చెప్పిన టీమిండియా ప్లేయర్..
టొమాటో దోసె.. 5 నిముషాల్లో ఇలా చేసేయండి.. రుచి అదిరిపోతోంది!
టొమాటో దోసె.. 5 నిముషాల్లో ఇలా చేసేయండి.. రుచి అదిరిపోతోంది!
అరటి కాయలతో అదిరిపోయే లాభాలు.. తెలిస్తే తొక్కను కూడా వేస్ట్ చేయరు
అరటి కాయలతో అదిరిపోయే లాభాలు.. తెలిస్తే తొక్కను కూడా వేస్ట్ చేయరు
ఆరోగ్యానికి మంచివే.. అతిగా తింటే మాత్రం ఆ సమస్యలు తప్పవు
ఆరోగ్యానికి మంచివే.. అతిగా తింటే మాత్రం ఆ సమస్యలు తప్పవు
ఐఫోన్‏తో షూటింగ్.. వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్..
ఐఫోన్‏తో షూటింగ్.. వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్..
ఉరిసి జ్యూస్ లేదా పసుపు నీరు.. అందమైన చర్మం కోసం ఏది బెస్ట్!
ఉరిసి జ్యూస్ లేదా పసుపు నీరు.. అందమైన చర్మం కోసం ఏది బెస్ట్!