AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పెరట్లో మొక్కలు నాటుతుండగా కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరే అద్భుతం

Viral: చాలా మంది తమ ఇంటి పెరట్లో మొక్కలు పెంచుతుంటారు. ఒకవేళ మొక్కలు ఎండిపోతే.. వాటి స్థానంలో మరొక కొత్త మొక్కను తీసుకువచ్చి నాటుతారు.

Viral: పెరట్లో మొక్కలు నాటుతుండగా కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరే అద్భుతం
Dainosar
Shiva Prajapati
|

Updated on: Aug 27, 2022 | 9:46 PM

Share

Viral: చాలా మంది తమ ఇంటి పెరట్లో మొక్కలు పెంచుతుంటారు. ఒకవేళ మొక్కలు ఎండిపోతే.. వాటి స్థానంలో మరొక కొత్త మొక్కను తీసుకువచ్చి నాటుతారు. తాజాగా ఓ వ్యక్తి కూడా ఇలాగే తన ఇంటి పెరట్లో మొక్కలు నాటబోయాడు. అయితే, ఇక్కడే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మొక్క కోసం గుంట తవ్వుతుండగా.. భారీ వస్తువేదో చేతికి తగిలింది. ఏంటా చూసే సరికి షాక్. విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలకు తెలియజేయగా.. వారు వచ్చి చెక్ చేయగా.. అద్భుతం బయటపడింది. అదేంటో కాదు.. భారీ డైనోసార్ అస్థిపంజరం. ఈ ఘటన ఐరోపాలోని పోర్చుగల్‌ పోంబల్‌లో వెలుగు చూసింది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోర్చుగల్‌లోని పోంబల్‌లో ఒక వ్యక్తి పెరట్లో భారీ డైనోసార్ అస్థిపంజరం బయటపడింది. ఇది ఐరోపాలో ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద అస్థిపంజరం. 2017లో ఇంటి పెరగల్లో శిలాజ ఎముకల శకలాలను గమనించి, పరిశోధనాధికారులకు సమాచారం అందించాడు. అదే సంవత్సరం తవ్వకాలుు ప్రారంభించారు అధికారులు. అయితే, తాజాగా తవ్వకాలు పూర్తి అవడంతో దాని శిలాజాలు పూర్తిస్థాయిలో బహిర్గతం అయ్యాయి. స్పెయిన్, పోర్చుగల్‌కు చెందిన పాలియోంటాలజిస్టులు ఒక వారం పాటు సైట్‌ను సందర్శించారు. డైనోసార్ శిలాజాన్ని పరిశీలించారు. ఆఫ్రికా ఖండంలో ఇప్పటి వరకు కనిపెట్టిన అతిపెద్ద సౌరోపాడ్ డైనోసార్ అవశేంగా పేర్కొన్నారు. సౌరోపాడ్‌లు మొక్కలను తింటాయని, పొడవైన మెడ, తోక కలిగి, నాలుగు కాళ్లు కలిగి ఉంటాయన్నారు. ఈ డైనోసార్‌ 39 అడుగుల వెడల్పు, 82 అడుగుల పోడవుతో ఉంటుందన్నారు. అయితే, ఈ సౌరోపాడ్‌లలో శిలాజాలు ఇంతకాలం ఉండటం అసాధారణం అని లిస్బన్ యూనివర్సిటీ పోస్ట్ డాక్టోరల్ పరిశోధకురాలు డాక్టర్ ఎలిజబెత్ మలాఫాయా పేర్కొన్నారు. డైనోసార్ జాతులు 160 నుంచి 100 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై సంచరించాయి. దీని ప్రకారం.. ఈ సౌరోపాడ్‌ డైనోసార్‌ల శిలాజాలు ఇప్పటి వరకు ఉండటం నిజంగా ఆశ్చర్యకరం అని పేర్కొన్నారు పరిశోధకులు.

తాజాగా లభించిన శిలాజాలు, పక్కటెముకలు మూడు మీటర్లు(10 అడుగుల పొడవు) ఉంటుందని మలాఫాయా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా లభించిన సౌరోపాడ్‌లలో ఇది అతిపెద్ద పక్కటెముకలు అని ఆమె వివరించారు. జురాసిక్ అంత్య సమయంలో ఐబీరియన్ ద్వీపకల్పంలో నివసించిన ఖండాంతర జంతుజాలాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఈ శిలాజ రికార్డు ముఖ్యమైనదిగా పేర్కొన్నారామె.

ఇవి కూడా చదవండి
Dinosaur

Dinosaur

Skeleton Of Dinosaur

Skeleton Of Dinosaur

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..