Viral Video: సర్పాల సయ్యాట.. తన్మయంతో పెనవేసుకొన్న పాములు వీడియో వైరల్..
Viral Video: సర్పాల్ని చూస్తే భయపడతాం.. అదే సర్పాలు నాట్యం చేస్తే.. చూడటానికి భలే ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తన్మయంతో సర్పాలు కనువిందు..
Viral Video: సర్పాల్ని చూస్తే భయపడతాం.. అదే సర్పాలు నాట్యం చేస్తే.. చూడటానికి భలే ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తన్మయంతో సర్పాలు కనువిందు చేస్తున్నాయి. ఒకదానికొకటి పెనవేసుకొని ఆడిన సయ్యాట చూపరులను ఆకట్టుకుంది. సాధారణంగా పాములంటే చాలామందికి చెప్పలేనంత భయం. పాము పేరు ఎత్తగానే భయంతో వణికిపోతుంటారు. దాని పేరు ఎత్తడానికి కూడా కొంత మంది ఇష్టపడరు. ఒక వేళ పాము కనిపిస్తే.. అక్కడి దారిదాపుల్లోకి వెళ్లే సాహసం కూడా చేయరు. ఒక్కొసారి ఆహారం కోసం, ఆవాసం కోసం అవి దారితప్పి జనాల్లోకి వస్తాయి. అయితే జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఘాట్ రోడ్ వైపు వెళ్ళే దారిలో వినాయక చవితి రోజున రెండు సర్పాల సయ్యాట చేస్తూ కనివిందు చేశాయి.
ఒకదానికి మరొకటి పెన వేసుకొని దాదాపు రెండు గంటల పాటు సయ్యాటలో మునిగిపోయాయి. అటుగా వెళ్లే భక్తులు పాములను ఆసక్తిగా గమనించారు. ఫోన్లలో వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో వినాయక చవితి రోజు విషసర్పాలు పట్ట పగలే రోడ్లపై హల్‌చల్ చేశాయి. అటు ఇటు తిరుగుతూ బాటసారులను భయబ్రాంతులకు గురిచేశాయి. పాముల సంచారంతో వినాయక మండపాలకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. పదుల సంఖ్యలో పాములు రోడ్లపైకి వస్తుండటంతో ఇంట్లోంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండు కుండల్లా మారిపోయాయి. దీంతో విష సర్పాలు రోడ్లపైకి, ఇళ్లల్లోకి వస్తున్నాయి. మొత్తానికి సర్పాల సంచారం జనాన్ని షేక్ చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..