AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఏం గుండె ధైర్యం సామీ నీది.. ‘గుమ్మడికాయ’తో బోట్.. నదిలో 61 కిలోమీటర్ల ప్రయాణం..

Viral: చాలామందికి సాహసాలు చేయాలంటే ఇష్టం. అందుకే వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. వీరు తమ భిన్నమైన ఆలోచనలతో..

Viral: ఏం గుండె ధైర్యం సామీ నీది.. ‘గుమ్మడికాయ’తో బోట్.. నదిలో 61 కిలోమీటర్ల ప్రయాణం..
Pumpkin
Shiva Prajapati
|

Updated on: Aug 31, 2022 | 10:08 PM

Share

Viral: చాలామందికి సాహసాలు చేయాలంటే ఇష్టం. అందుకే వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. వీరు తమ భిన్నమైన ఆలోచనలతో ముందడుగు వేస్తుంటారు. తమకు వచ్చిన ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతకైనా తెగిస్తారు. ఏదో భిన్నంగా చేయాలని ఆలోచించే వీరు.. కొన్నిసార్లు చరిత్రను కూడా సృష్టిస్తారు. తాజాగా ఓ వ్యక్తి కూడా ఇలాగే రికార్డ్ సృష్టించాడు.

గుమ్మడికాయ గురించి మనందరికీ తెలిసిందే. చాలా మంది గుమ్మడి కాయ జ్యూస్, గుమ్మడి విత్తనాలను తినడం, గుమ్మడికాయ కూర వంటివి చేసుకుని తింటుంటారు. అయితే, గుమ్మడికాయ సహాయంతో ప్రపంచ రికార్డు కూడా చేయవచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవును, 60 ఏళ్ల ఓ వ్యక్తి అలాంటే పని చేశాడు. ఒక పెద్ద గుమ్మడికాయ సహాయంతో అతను ఒక ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇది తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

డూన్ హాన్సెన్ అనే 60 ఏళ్ల వ్యక్తి భారీ గుమ్మడికాయతో ఓ పడవ తయారు చేశాడు. ఆ పడవ సాయంతో నదిలో సుదీర్ఘ ప్రయాణం చేసి చరిత్ర సృష్టించాడు. ‘గుమ్మడి పడవ’ సాయంతో దాదాపు 61 కిలోమీటర్లు ప్రయాణించాడు. అలా గిన్నీస్ వరల్డ్ రికార్డులకెక్కాడు. అమెరికా వాసి అయిన మిస్టర్ హాన్సెన్ ఒక పెద్ద గుమ్మడి కాయను మధ్యలో కోసి.. సగభాగాన్ని పడవగా మార్చేశాడు. దానిలో కూర్చుని ఒక్కడే నదిలో సుదీర్ఘ ప్రయాణం చేశాడు. ఈ ఫీట్ ద్వారా ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేసిన హాన్సెన్.. సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. మిస్సోరి నదిపై మొత్తం 11 గంటల పాటు 61 కిలోమీటర్లు ప్రయాణించాడు. మధ్యలో మోకాళ్లకు దెబ్బ తగిలినా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ప్రపంచంలో ఎవరూ చేయలేని సాహసం చేసి చూపాడు.

ఇవి కూడా చదవండి

కాగా, మన దేశంలో చిన్న సైజు గుమ్మడి కాయలే ఉంటాయి. విదేశాల్లో మాత్రం చాలా పెద్ద పెద్ద గుమ్మడి కాయలు ఉంటాయి. వీటి బరువు దాదాపు 10 నుంచి 20 క్వింటాళ్ల వరకు కూడా ఉంటాయి. గతేడాది ఇటలీకి చెందిన ఓ రైతు దాదాపు 1,226 కిలోల గుమ్మడికాయను పండించి ప్రపంచ రికార్డును సృష్టించాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..