Viral: విచిత్ర ప్రేమ కథ.. 55 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడిన 18 ఏళ్ల యువతి.. ఆ ఇద్దరూ ఎలా దగ్గరయ్యారంటే!

ఆ యువతి వయస్సు 18 ఏళ్లు. పాటలు బాగా పాడుతుంది. ఆమె స్వరం.. అక్కడే ఆ యువతి ఇంటి ఎదురుగా నివసిస్తున్న..

Viral: విచిత్ర ప్రేమ కథ.. 55 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడిన 18 ఏళ్ల యువతి.. ఆ ఇద్దరూ ఎలా దగ్గరయ్యారంటే!
Unique Love Story
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 31, 2022 | 9:13 PM

ఆ యువతి వయస్సు 18 ఏళ్లు. పాటలు బాగా పాడుతుంది. ఆమె స్వరం.. అక్కడే ఆ యువతి ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఫరూక్ అనే 55 ఏళ్ల వ్యక్తిని మంత్రముగ్ధున్ని చేసింది. అంతే! అతడు కాస్తా ఆమె పాటలకు ఫిదా అయిపోయాడు. తరచూ ఆమె గానాన్ని వినేందుకు ఆమె ఇంటికి వెళ్ళేవాడు. ఈ క్రమంలోనే ఆ యువతి కూడా అతడ్ని ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది. చివరికి ఈ ప్రేమ జంట.. పెళ్లి చేసుకుని తన కథను సుఖాంతం చేసుకున్నారు. ఇంతకీ ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌కు చెందిన 18 ఏళ్ల ముస్కాన్, 55 ఏళ్ల ఫరూక్ ప్రేమ కథ ఇది. సయ్యద్ బాసిత్ అలీ అనే యూట్యూబర్ వారిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా.. ప్రస్తుతం ఈ విచిత్రమైన ప్రేమకథ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది ఆ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రేమ జంట వారి ప్రేమకథను నెటిజన్లతో పంచుకుంది. ‘నేను ముస్కాన్ ఇంటి ఎదురుగా ఉండేవాడిని. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. ముస్కాన్ స్వరం నన్ను ఆకర్షించింది. ఆమె పాటలు వినేందుకు తరచూ ముస్కాన్ ఇంటికి వెళ్లేవాడిని. పాటల గురించి చర్చించేవాడిని. ఆ క్రమంలోనే ఇద్దరం దగ్గరయ్యాం. ఇక కొన్ని మీటింగ్స్ అనంతరం ఆమె బాబీ డియోల్ సినిమాలోని ‘నా మిలో హంసే జ్యాదా’ అంటూ తనలోని ప్రేమను వ్యక్తపరిచింది. మొదట్లో నాకు అర్ధం కాలేదు. ఆ తర్వాత ముస్కాన్ నాకు ప్రపోజ్ చేసింది. అప్పుడు షాక్ అయ్యాను. అనంతరం నేను కూడా తన ప్రేమకు అంగీకారం తెలిపాను. ముస్కాన్ ప్రేమను నా అదృష్టంగా భావించాను’ అని ఫరూక్ తెలిపాడు.

‘నాపై ఫరూక్ చూపించే అభిమానం, మాట్లాడే విధానం నన్ను ఎంతగానో ఆకర్షించింది. మా రిలేషన్‌ను స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యులు కాదన్నారు. అయినా అవేం పట్టించుకోలేదు. ఫరూక్ కోసం ఏదైనా చేయగలను, నా ప్రాణాన్ని సైతం ఇవ్వగలను’ అని ముస్కాన్ తెలిపింది. కాగా, ఎవ్వరేం కాదన్నా.. చివరికి పెళ్లి ద్వారా ఈ ప్రేమ జంట ఒకటై.. తమ కథను సుఖాంతం చేసుకున్నారు.