Viral Video: వామ్మో! నీకు దండంరా సామీ.. చికెన్ ముక్కను గాలమేసి కొండచిలువను పట్టుకున్నాడుగా..
పాములను పట్టుకోవడం ఓ టెక్నిక్. అందరికీ సాధ్యం కాదు. వీటిని స్నేక్ క్యాచర్స్ అయితే చాకచక్యంగా పట్టుకుంటారు. మరి కొండచిలువను..
పాములను పట్టుకోవడం ఓ టెక్నిక్. అందరికీ సాధ్యం కాదు. వీటిని స్నేక్ క్యాచర్స్ అయితే చాకచక్యంగా పట్టుకుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది.. మరి కొండచిలువను పట్టుకోవడం సాధ్యమేనా.! దీనికి సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. కొండచిలువను పట్టుకోవడంలో ఎక్కడ పొరపాటు చేసినా.. మన ప్రాణాలే పోతాయి. అయితే ఇక్కడొక వ్యక్తి భారీ కొండచిలువను చాలా ఈజీగా పట్టేసుకున్నాడు. అదెలాగో చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ పొలంలో చికెన్ ఓ త్రాడుకి కట్టి వేలాడుతున్నట్లు మీరు చూడవచ్చు. బహుశా ఆ పొలాన్ని పాడు చేస్తున్న జంతువులను పట్టుకునేందుకు ఇలా ఎర పన్నారని మీరు అనుకోవచ్చు. అయితే అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఆ వ్యక్తి ఏకంగా కొండచిలువను పట్టుకునేందుకే వల పన్నాడు. ఇలా స్కెచ్ వేసి.. చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నాడు.. వీడియో ఫార్వార్డ్ చేస్తే మీకే తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Python trap using live chicken pic.twitter.com/oorUWucL3A
— OddIy Terrifying (@closecalls7) August 27, 2022
కాగా, ఈ వీడియోను ‘oddly terrifying’ అనే ట్విట్టర్ పేజీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటిదాకా 3.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే 98 వేల మంది ఈ వీడియోను లైక్ చేయగా.. 15.2 వేల మంది దీన్ని రీ-ట్వీట్ చేశారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..