LPG Cylinder Price: ఒకటో తేదీ ఊరట.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. హైదరాబాద్ నగరంలో ఇలా..

ఒకటో తేదీ ఊరట. గ్యాస్​ సిలిండర్ రేటును భారీగా తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధర.. రూ.91.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

LPG Cylinder Price: ఒకటో తేదీ ఊరట.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. హైదరాబాద్ నగరంలో ఇలా..
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 01, 2022 | 8:13 AM

పెరిగిన ధరలతో బాధపడుతున్న సామాన్యులకు నెల మొదటి రోజే పెద్ద ఊరట లభించింది. గత 5 నెలల్లో 5వ సారి ధర తగ్గించింది.సెప్టెంబరు 1వ తేదీన ఎల్‌పిజి సిలిండర్ల ధరలను తగ్గించారు. గ్యాస్​ సిలిండర్ రేటును భారీగా తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలో రూ.91.50 భారీగా తగ్గింది. అయితే, ఈ ధర తగ్గింపు కేవలం వాణిజ్య సిలిండర్లపై మాత్రమే ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధర.. రూ.91.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం..

19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు భారీగా తగ్గించాయి. రూ.91.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఈరోజు సెప్టెంబర్ 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది. 19 కిలోల కమర్షియల్ ఇండన్ గ్యాస్ సిలిండర్ పాత ధర రూ. 1976 07 నుంచి ఇప్పుడు రూ. 1885 లభిస్తుంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1885కు, ముంబయిలో రూ.1844కు లభించనుంది. మే 19 నుంచి వాణిజ్య సిలిండర్ ధర 5వ సారి తగ్గింది. ఇదిలా ఉండగా ఇంట్లో వంటకు ఉపయోగించే సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌, వాణిజ్య అవసరాల కోసం వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరల్లో మార్పుల ఆధారంగా ముడి చమురు ధరలు నిర్ణయించబడతాయి.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ముడి చమురు ధర పెరిగింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ల ధరలు అనేక రెట్లు పెరిగాయి. ఇప్పుడు ముడిచమురు ధర తగ్గడం ప్రారంభించడంతో దానితో తయారయ్యే ఉత్పత్తుల ధర కూడా తగ్గుముఖం పట్టింది. తగ్గించిన గ్యాస్ ధరల ప్రభావం టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లుపై ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం