AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: బీహార్ పర్యటనలో కేంద్రప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్.. విపక్షాలను లీడ్ చేసేది ఎవరంటే..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ బీహార్‌ పర్యటన బిజీబిజీగా సాగింది. రాజకీయ భేటీల తరువాత కేసీఆర్‌ పాట్నా గురుద్వారాను సందర్శించారు. గురుద్వారాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. సిక్కుల తలపాగాను

CM KCR: బీహార్ పర్యటనలో కేంద్రప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్.. విపక్షాలను లీడ్ చేసేది ఎవరంటే..
Kcr
Amarnadh Daneti
|

Updated on: Sep 01, 2022 | 7:28 AM

Share

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ బీహార్‌ పర్యటన బిజీబిజీగా సాగింది. రాజకీయ భేటీల తరువాత కేసీఆర్‌ పాట్నా గురుద్వారాను సందర్శించారు. గురుద్వారాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. సిక్కుల తలపాగాను ధరించారు. కేసీఆర్‌కు తల్వార్‌ను బహుకరించారు బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్‌. గురుద్వారా కమిటీ కేసీఆర్‌ను ఘనంగా సన్మానించింది. బీజేపీ ముక్త్‌ భారత్‌ కోసం ఉద్యమించాలన్నారు సీఎం కేసీఆర్. విద్వేషం పెరిగితే దేశానికి భారీ నష్టమని అన్నారు. విపక్షాలను ఏకంచేసే విషయంపై నితీష్‌తో చర్చించామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఏకతాటిపై ఉన్నాం. ఎవరు లీడ్‌ చేస్తారో ఎన్నికల సమయంలో చెప్తామని తెలిపారు. విస్తృత చర్చ తర్వాత నాయకత్వాన్ని ఎన్నుకుంటామన్నారు సీఎం కేసీఆర్. దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నా వినియోగించట్లేదు. కేంద్రం మంచిచేస్తే రైతులు ఎందుకు ఉద్యమిస్తారని ప్రశ్నించారు. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం పేరుకు మాత్రమే పరిమితమైంది. వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నామని ఆరోపించారు కేసీఆర్.

బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్, ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చర్చించారు. మొన్నటివరకు బీజేపీతో కలిసి ఉన్న నితీష్ కుమార్ ఇటీవల ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్జేడీతో జతకట్టారు. దీంతో బీహార్ లో కీలకంగా ఉన్న రెండు పార్టీల నేతలతో సమావేశం కావడం ద్వారా.. భవిష్యత్తులో విపక్షాలను ఏకం చేయడంపై దృష్టిసారించాలని చర్చించినట్లు తెలుస్తోంది. అయితే బీహార్ ప్రభుత్వంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి ఉన్నాయి. కేసీఆర్ మాత్రం తాము కాంగ్రెస్ ఉన్న కూటమిలో ఉండబోమని చెప్తూ వస్తున్నారు. మరి కాంగ్రెస్ లేకుండా మిగిలిన పార్టీలన్ని కలిసి కూటమిగా ఏర్పడటానికి అవకాశమే లేదని.. ఏర్పడిన అది విఫల కూటమే అవుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఏమి జరగనుందనేది భవిష్యత్తులో తేలనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయవార్తల కోసం చూడండి..