9 పరుగులకే 5 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ కమ్ కెప్టెన్.. అయినా ఓడిన జట్టు.. చెత్త రికార్డులో చేరిన తొలి ప్లేయర్‌.!

కెన్యాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో సందీప్ లామిచానే అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో ఓడిపోయింది.

9 పరుగులకే 5 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ కమ్ కెప్టెన్.. అయినా ఓడిన జట్టు.. చెత్త రికార్డులో చేరిన తొలి ప్లేయర్‌.!
Sandeep Lamichhane
Follow us
Venkata Chari

|

Updated on: Aug 30, 2022 | 5:30 PM

జట్టు ఎలా రాణిస్తుందో ఆ జట్టు కెప్టెన్ పనితీరు, నాయకత్వ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని అంటారు. కానీ, కెన్యాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో సందీప్ లామిచానే అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. అది కూడా ఆ జట్టు కెప్టెన్ కం స్పిన్నర్ సందీప్ లామిచానే కెన్యా జట్టులోని 5 మంది బ్యాట్స్‌మెన్‌లను కేవలం 9 పరుగులకే కుప్పకూల్చాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో ఒక జట్టు కెప్టెన్ ప్రత్యర్థి జట్టులో 5 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. ఈ కోణంలో సందీప్ లామిచానే 5 వికెట్లు తీసిన తర్వాత కూడా T20I మ్యాచ్‌లో ఓడిపోయిన మొదటి కెప్టెన్‌గా నిలిచాడు.

కెన్యా 101 పరుగులకు ఆలౌట్..

ఈ మ్యాచ్‌లో కెన్యా జట్టు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఒంటిచేత్తో సగం జట్టును పెవిలియన్ చేర్చిన సందీప్ లామిచానే ధాటికి బ్యాటర్ల వద్ద సమాధానం లేకపోయింది. 4 ఓవర్లలో 9 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సందీప్ లామిచానే చావుదెబ్బ కొట్టినా.. నేపాల్ 102 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.

ఇవి కూడా చదవండి

కానీ, ఎప్పుడైతే నేపాల్‌ జట్టు లక్ష్యాన్ని ఛేదించే పనిలో పడిందో.. ఆ తర్వాత 102 పరుగుల సులువైన లక్ష్యం కూడా కొండలా కనిపించడం ప్రారంభించింది. నేపాల్‌ బ్యాట్స్‌మెన్‌ వికెట్‌పై స్థిరపడేందుకు కూడా ప్రయత్నించలేదు. కెన్యా జట్టులా ఆలౌట్ కాలేదు. 20 ఓవర్లు ముగిసేసరికి నేపాల్ 9 వికెట్లు మాత్రమే కోల్పోయింది. కానీ మ్యాచ్ కెన్యా పేరులోనే ఉండిపోయింది.

నేపాల్ జట్టు 94 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో 5 టీ20ల సిరీస్ ప్రస్తుతం 2-2తో సమమైంది. అంటే ఇప్పుడు మంగళవారం జరిగే 5వ టీ20లో ఏ జట్టు గెలుస్తుందో.. సిరీస్ కూడా ఆ జట్టుకే సొంతం కానుంది.