వాహనదారులకు అలర్ట్.. అలా చేశారో భారీగా ఫైన్.. ఏడాది జైలు శిక్ష కూడా.. తస్మాత్ జాగ్రత్త!

అన్ని ట్రాఫిక్ నియమాలు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. అయితే, కొన్నిసార్లు చిన్నచిన్న తప్పులతో భారీగా ఫైన్లు కట్టాల్సి వస్తుంది.

వాహనదారులకు అలర్ట్.. అలా చేశారో భారీగా ఫైన్.. ఏడాది జైలు శిక్ష కూడా.. తస్మాత్ జాగ్రత్త!
Traffic
Follow us
Venkata Chari

|

Updated on: Aug 30, 2022 | 6:01 PM

Traffic Rules: మన దేశంలో ఏదైనా మోటారు వాహనం నడపాలంటే డ్రైవర్‌కు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండటం తప్పనిసరి. ఈ వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఎటువంటి వాహనాన్ని నడపకూడదు. మోటారు వాహనాన్ని నడపాలన్న ఈ నిబంధన చాలా పాతదే అయినా.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషి దృష్ట్యా.. ఇప్పుడు ఈ నిబంధనలకు విరుద్ధంగా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ, ప్రతిరోజూ చాలా మంది మైనర్ టీనేజర్లు వీధుల్లో కనిపిస్తున్నారు. కాబట్టి మోటారు వాహన చట్టంలో ఏముందో, దానికి సంబంధించిన నియమాలు, దానికి శిక్షలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

రూల్స్ ఎలా ఉన్నాయంటే?

మోటారు వాహన చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం, 18 ఏళ్లలోపు బాలుడు ఎలాంటి లెర్నింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే, అతని తల్లిదండ్రులు రూ.25,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 199A ప్రకారం గరిష్టంగా ఒక సంవత్సరం వరకు జైలు శిక్షను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నిబంధనలు కఠినతరం..

ఇలాంటి కేసులను కఠినంగా ఎదుర్కొనేందుకు ఎన్ఐసీ వర్చువల్ కోర్టు ఏర్పాటు ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇది ఏర్పడిన తర్వాత వాహన యజమాని వాహనాల చలాన్‌ను విధించిన తేదీ నుంచి 15 రోజులలోపు చలాన్ మొత్తాన్ని చెల్లించాలి. పట్టించుకోకపోతే జిల్లా, సెషన్స్ కోర్టు కఠిన చర్యలు తీసుకుని రికవరీకి చర్యలు తీసుకుంటాయంట.

తల్లిదండ్రులదే బాధ్యత..

అన్ని ట్రాఫిక్ నియమాలు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. ఏ తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రమాదానికి గురికావాలని కోరుకోరు. అందువల్ల, నిబంధనలలో అలసత్వం చూపకుండా ఉండాలి. కానీ, తల్లిదండ్రులు ఈ విషయంలో కఠినంగా ఉండాలి. వారి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే ఆ శిక్షను తల్లిదండ్రులు కూడా భరించాల్సి ఉంటుంది.